Telugu Global
Others

మోదీ, స్మృతి భార్యాభర్తలట!

రాజకీయ నాయకుల నోటికి హద్దు అదుపు లేకుండా పోతోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అసోం కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి స్మృతి ఇరానీ రెండో భార్య అంటూ చేయకూడని విమర్శ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నీలమోణి సేన్ డేకా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. నీలమోణి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే అతడిని అరెస్ట్ […]

మోదీ, స్మృతి భార్యాభర్తలట!
X

రాజకీయ నాయకుల నోటికి హద్దు అదుపు లేకుండా పోతోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై అసోం కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి స్మృతి ఇరానీ రెండో భార్య అంటూ చేయకూడని విమర్శ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నీలమోణి సేన్ డేకా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. నీలమోణి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని అసోం బీజేపీ డిమాండ్ చేసింది. లేకుంటే కోర్టుకు వెళ్తామని కమలనాథులు అంటున్నారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై సోనియా గాంధీ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఇంతలోనే అసోం రాష్ట్రానికే చెందిన మరో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రూప్‌ జ్యోతి కుర్మి కూడా మోదీ, ఇరానీ గురించి అవే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.click to read: కాల్‌మనీ కొత్త కోణం- వెలుగులోకి గ్యాంగ్‌ రేప్‌, కాల్‌డేటా…

First Published:  28 Dec 2015 1:40 AM GMT
Next Story