Telugu Global
Others

ఎమ్మెల్యే లేకుండానే జగన్ బలప్రదర్శన

కడప జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరుతారని వార్తలొస్తున్న వేళ జగన్‌ జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. బలప్రదర్శన చేస్తున్నారా అన్నట్టుగా ఈ ర్యాలీ సాగింది. ర్యాలీకి భారీగానే జనం హాజరయ్యారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పాల్గొనలేదు. అసలు ఆయనకు వైసీపీ నుంచి ర్యాలీకి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ఆదినారాయణరెడ్డిపై జగన్‌ కూడా క్లారిటీకి వచ్చారని భావిస్తున్నారు. జమ్మలమడుగులో బలం ఎవరిదో తెలియజేసేందుకు అన్నట్టుగా జగన్ […]

ఎమ్మెల్యే లేకుండానే జగన్ బలప్రదర్శన
X

కడప జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైసీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరుతారని వార్తలొస్తున్న వేళ జగన్‌ జమ్మలమడుగులో భారీ ర్యాలీ నిర్వహించారు. బలప్రదర్శన చేస్తున్నారా అన్నట్టుగా ఈ ర్యాలీ సాగింది. ర్యాలీకి భారీగానే జనం హాజరయ్యారు.

ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పాల్గొనలేదు. అసలు ఆయనకు వైసీపీ నుంచి ర్యాలీకి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ఆదినారాయణరెడ్డిపై జగన్‌ కూడా క్లారిటీకి వచ్చారని భావిస్తున్నారు. జమ్మలమడుగులో బలం ఎవరిదో తెలియజేసేందుకు అన్నట్టుగా జగన్ ర్యాలీ నిర్వహించారు. ఆదినారాయణరెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాత్రం జగన్‌ను కలిసేందుకు వచ్చారు. ఆదినారయణరెడ్డి వర్గీయులు కూడా ర్యాలీకి హాజరుకాలేదు.

Click to Read: వైసీపీలో రామసుబ్బారెడ్డి ? జగన్‌తో బంధువుల మంతనాలు

పూర్తిగా ఆదినారాయణరెడ్డి వర్గీయులు సాయం లేకుండా ర్యాలీ తీశారు. ర్యాలీకి భారీగా స్పందన రావడంతో పార్టీలో ఆదినారాయణరెడ్డి లేకున్నా జమ్మలమడుగులో వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని స్థానిక వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ర్యాలీలో వైఎస్‌ వివేకానందరెడ్డి, అనినాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ర్యాలీలో ఎక్కడా కూడా జగన్ ప్రసంగించకపోవడం విశేషం. ఆదినారాయణరెడ్డి విషయంలో అప్పడే మాట్లాడడం తొందరపాటు అవుతుందన్న ఉద్దేశంతోనే జగన్ ప్రసంగించలేదని చెబుతున్నారు.

First Published:  27 Dec 2015 12:19 AM GMT
Next Story