Telugu Global
Cinema & Entertainment

అప్పుడే రెండో సినిమాపై కన్నేశాడు

నిర్మాతగా మారితే కలిగే సుఖమేంటో సుకుమార్ కు తెలిసొచ్చింది. లాభాలు కళ్ల ముందు కనిపిస్తుంటే ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో సుకుమార్ ను చూస్తే అర్థమౌతుంది. అందుకే ఈ స్టార్ డైరక్టర్ ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమాకు చకచకా రెడీ అయిపోతున్నాడు. సుక్కూ నిర్మాతగా కుమారి 21-ఎఫ్ విడుదలై ఘనవిజయం సాధించకపోయినప్పటికీ…. నిర్మాతగా సుకుమార్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో […]

అప్పుడే రెండో సినిమాపై కన్నేశాడు
X
నిర్మాతగా మారితే కలిగే సుఖమేంటో సుకుమార్ కు తెలిసొచ్చింది. లాభాలు కళ్ల ముందు కనిపిస్తుంటే ఆ ఉత్సాహం ఎలా ఉంటుందో సుకుమార్ ను చూస్తే అర్థమౌతుంది. అందుకే ఈ స్టార్ డైరక్టర్ ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమాకు చకచకా రెడీ అయిపోతున్నాడు. సుక్కూ నిర్మాతగా కుమారి 21-ఎఫ్ విడుదలై ఘనవిజయం సాధించకపోయినప్పటికీ…. నిర్మాతగా సుకుమార్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే రెండో సినిమా షురూ చేశాడు సుకుమార్. త్వరలోనే డైరక్టర్ పేరుతో ఓ సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. తన పాత పంథాలోనే ఈ సినిమాకు కూడా కథ, స్క్రీన్ ప్లే సమకూర్చే పనిలో సుక్కూ బిజీ అయిపోయాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తనతో పనిచేస్తున్న దేవిశ్రీప్రసాద్, రత్నవేలును ఈ సినిమాలో కూడా కొనసాగిస్తున్నాడు. మరి నిర్మాతగా తన రెండో సినిమాను ఈసారి ఎవరి చేతిలో పెడతాడో చూడాలి.
First Published:  25 Dec 2015 7:02 PM GMT
Next Story