Telugu Global
Cinema & Entertainment

సర్దార్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు

ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టాడు పవన్ కల్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను పరుగులుపెట్టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ గుజరాత్ లో పూర్తయింది. గుజరాత్‌లో ఈ సినిమాకు ఇది రెండో షెడ్యూల్ కావడం విశేషం. ప్రస్తుతం రిలాక్స్ మూడ్ లో ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా…. తన నెక్ట్స్ షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ఫిక్స్ చేసింది.  ఈసారి షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే జరిగేలా ప్లాన్ చేసింది. […]

సర్దార్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు
X
ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టాడు పవన్ కల్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను పరుగులుపెట్టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ గుజరాత్ లో పూర్తయింది. గుజరాత్‌లో ఈ సినిమాకు ఇది రెండో షెడ్యూల్ కావడం విశేషం. ప్రస్తుతం రిలాక్స్ మూడ్ లో ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా…. తన నెక్ట్స్ షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ఫిక్స్ చేసింది. ఈసారి షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే జరిగేలా ప్లాన్ చేసింది. ఎందుకంటే…. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత సంక్రాంతి పండగ కూడా వస్తోంది కాబట్టి… యూనిట్ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమా షెడ్యూల్ నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ గ్యాప్ లో పవనిజం అభిమానుల కోసం న్యూ ఇయర్ కానుకగా టీజర్ విడుదల చేయాలని నిర్ణయించారు. సరిగ్గా డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టీజర్ విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ టీజర్ కటింగ్ పనిమీదే పవన్ బిజీగా ఉన్నాడు.
First Published:  25 Dec 2015 7:06 PM GMT
Next Story