Telugu Global
Others

త‌మ్ముడి కోసం అన్న స‌వాల్‌

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. సంఖ్యాప‌రంగా చూస్తే కాంగ్రెస్ బ‌ల‌మే ఎక్కువ‌గా ఉన్నా అధికార టీఆర్ ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ద్వారా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ త‌ర‌పున మాజీ ఎంపీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బ‌రిలో దిగారు. ఈనేప‌థ్యంలో త‌న తమ్ముడి గెలుపుపై ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు ఓడిపోతే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్పారు. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా […]

త‌మ్ముడి కోసం అన్న స‌వాల్‌
X

న‌ల్ల‌గొండ ఎమ్మెల్సీ ఎన్నిక టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. సంఖ్యాప‌రంగా చూస్తే కాంగ్రెస్ బ‌ల‌మే ఎక్కువ‌గా ఉన్నా అధికార టీఆర్ ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ ద్వారా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ త‌ర‌పున మాజీ ఎంపీ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బ‌రిలో దిగారు. ఈనేప‌థ్యంలో త‌న తమ్ముడి గెలుపుపై ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు ఓడిపోతే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని చెప్పారు. టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని స‌వాల్ విసిరారు. టీఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నందునే ఈ సవాల్ చేస్తున్నానని, దీన్ని ముఖ్యమంత్రి స్వీకరించాలన్నారు.

First Published:  25 Dec 2015 9:27 PM GMT
Next Story