Telugu Global
Others

రోజా నెత్తిన కల్లు కుండలు, వేప మండలు

సెటైర్ల పొలిటీషియన్, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి పంచ్‌ డైలాగులు విసిరారు. ఈసారి రోజాను టార్గెట్ చేశారు. నెత్తిన కల్లుకుండలు, చేతిలో వేపమండలు పట్టుకుని పూనకం వచ్చినట్టు అసెంబ్లీలో రోజా ఊగిపోయిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని వైసీపీ ఎమ్మెల్యేలు జాతరగా మార్చారని విమర్శించారు. జాతర్లో నెత్తిన కల్లు కుండలు, రెండు చేతుల్లో వేపమండలు పట్టుకుని ఊగిపోతూ అవతలి వారిని తిట్టినట్టుగా రోజా వ్యవహరించారన్నారు. ఆడకూతురు దొరికిందని జగన్‌ కూడా ప్రోత్సహించారని మండిపడ్డారు. రోజా అలా ఊగిపోతుంటే […]

రోజా నెత్తిన కల్లు కుండలు, వేప మండలు
X

సెటైర్ల పొలిటీషియన్, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి పంచ్‌ డైలాగులు విసిరారు. ఈసారి రోజాను టార్గెట్ చేశారు. నెత్తిన కల్లుకుండలు, చేతిలో వేపమండలు పట్టుకుని పూనకం వచ్చినట్టు అసెంబ్లీలో రోజా ఊగిపోయిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని వైసీపీ ఎమ్మెల్యేలు జాతరగా మార్చారని విమర్శించారు. జాతర్లో నెత్తిన కల్లు కుండలు, రెండు చేతుల్లో వేపమండలు పట్టుకుని ఊగిపోతూ అవతలి వారిని తిట్టినట్టుగా రోజా వ్యవహరించారన్నారు. ఆడకూతురు దొరికిందని జగన్‌ కూడా ప్రోత్సహించారని మండిపడ్డారు. రోజా అలా ఊగిపోతుంటే ఎందుకు అడ్డుకోలేదని జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ ఒక నమ్మకద్రోహి అని ఆనం అన్నారు. గతంలో వైఎస్ పాదయాత్ర కోసం డబ్బులు ఖర్చు చేసిన వారిని కూడా జగన్ మర్చిపోయారని విమర్శించారు.

First Published:  26 Dec 2015 6:15 AM GMT
Next Story