Telugu Global
Cinema & Entertainment

గృహిణి అవుతున్న అనుష్క

రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో వంటి సినిమాల్లో తన విలక్షణ నటనతో అలరించింది అనుష్క. అనుష్క పెళ్లిపై చాలాకాలంగా చర్చ జరుగుతున్నా … ఆమె అభిమానులు మాత్రం తమ ఇష్టమైన హీరోయిన్‌ను వెండి తెరపై ఇంకా చాలా కాలం పాటు  గ్లామర్ పాత్రల్లోనే చూసి తరించాలనుకుంటున్నారు. అయితే అభిమానుల  కోరికకు భిన్నంగా అనుష్క ముందుకెళ్తోంది. బాధ్యతాయుతమైన గృహిణిగా మెలిగే మరో డిఫరెంట్ రోల్‌ పోషించేందుకు సిద్ధమవుతోంది. హౌజ్ వైఫ్‌గా నటించబోతోంది. సింగం-3లో అనుష్క ఒక భారతీయ గృహిణిగా సూర్య సరసన […]

గృహిణి అవుతున్న అనుష్క
X

రుద్రమదేవి, బాహుబలి, సైజ్ జీరో వంటి సినిమాల్లో తన విలక్షణ నటనతో అలరించింది అనుష్క. అనుష్క పెళ్లిపై చాలాకాలంగా చర్చ జరుగుతున్నా … ఆమె అభిమానులు మాత్రం తమ ఇష్టమైన హీరోయిన్‌ను వెండి తెరపై ఇంకా చాలా కాలం పాటు గ్లామర్ పాత్రల్లోనే చూసి తరించాలనుకుంటున్నారు. అయితే అభిమానుల కోరికకు భిన్నంగా అనుష్క ముందుకెళ్తోంది. బాధ్యతాయుతమైన గృహిణిగా మెలిగే మరో డిఫరెంట్ రోల్‌ పోషించేందుకు సిద్ధమవుతోంది. హౌజ్ వైఫ్‌గా నటించబోతోంది. సింగం-3లో అనుష్క ఒక భారతీయ గృహిణిగా సూర్య సరసన యాక్ట్ చేయనున్నారు. సింగం రెండు స్వీకెల్స్‌లోనూ అనుష్క నటించింది. సింగం-3లో సూర్య భార్యగా వైవిధ్యమైన పాత్ర పోషించనుంది అనుష్క. వాస్తవానికి చాలా దగ్గరగా అనుష్క పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పార్ట్‌ 3 మూవీ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. శృతిహసన్‌ కూడా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతోంది.

First Published:  26 Dec 2015 4:36 AM GMT
Next Story