Telugu Global
Cinema & Entertainment

అత్తారింటికి దారేది బాటలో సౌఖ్యం

పవన్ నటించిన ఆల్ టైం హిట్ అత్తారింటికి దారేది బాటలో… గోపీచంద్ తాజా మూవీ సౌఖ్యం కూడా ఉంది. అయితే వసూళ్లలోనో… రికార్డుల్లోనో కాదు… పైరసీలో. అవును… సౌఖ్యం సినిమా అత్తారింటికి దారేది మూవీని గుర్తుచేస్తోంది. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడింది. ఇప్పుడు సౌఖ్యం మూవీ విషయంలో కూడా అదే జరిగింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో సౌఖ్యం ప్రత్యక్షమైంది. ప్రతి సినిమా పైరసీ అయిపోవడం కామనే. […]

అత్తారింటికి దారేది బాటలో సౌఖ్యం
X
పవన్ నటించిన ఆల్ టైం హిట్ అత్తారింటికి దారేది బాటలో… గోపీచంద్ తాజా మూవీ సౌఖ్యం కూడా ఉంది. అయితే వసూళ్లలోనో… రికార్డుల్లోనో కాదు… పైరసీలో. అవును… సౌఖ్యం సినిమా అత్తారింటికి దారేది మూవీని గుర్తుచేస్తోంది. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడింది. ఇప్పుడు సౌఖ్యం మూవీ విషయంలో కూడా అదే జరిగింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో సౌఖ్యం ప్రత్యక్షమైంది. ప్రతి సినిమా పైరసీ అయిపోవడం కామనే. మరి సౌఖ్యానికే ఎందుకంత స్పెషల్ అని అనుకోవద్దు. ఎందుకంటే…. అత్తారింటికి దారేది సినిమా తరహాలోనే సౌఖ్యం మూవీ కూడా హెచ్ డీ ప్రింట్ తో నెట్ లో దర్శనమిస్తోంది. ఎంచక్కా ఈ సినిమాను డీవీడీ క్వాలిటీలో చూసుకోవచ్చు. రిలీజై… మ్యాట్నీ షో కూడా పడకముందే… సౌఖ్యం హెచ్ డీ ప్రింట్ నెట్ లో దర్శనమివ్వడంతో మేకర్స్ షాకయ్యారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా దర్యాప్తు ప్రారంభించింది సౌఖ్యం టీం. మరోవైపు ఈ సినిమాకు థియేటర్లలో స్పందన అంతంతమాత్రంగానే ఉంది.
Next Story