Telugu Global
Editor's Choice

ఆ హాయి... శాప‌మే!

తొమ్మిది గంట‌ల‌కు పైగా నిద్ర‌, రోజంత‌టిలో ఎక్కువ గంట‌లు కూర్చునే ఉండ‌టం, శ‌రీరాన్ని అస‌లు శ్ర‌మ పెట్ట‌కపోవ‌డం….ఇవ‌న్నీ పైకి జీవితాన్ని ఎంజాయి చేయ‌డం లాగే క‌నిపించినా ఈ హాయిలో ఉన్న‌దంతా శాప‌మేన‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంత‌కీ ఇలాంటి జీవ‌న శైలి ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుంది…అనే వివ‌రాల్లోకి వెళితే- స్లీప్‌, సిట్టింగ్ ఇవి రెండూ క‌లిసి  ఆరోగ్యాన్ని ఎలా  హ‌రించివేస్తాయ‌నే విష‌యం మీద నిపుణులు అధ్య‌య‌నం చేశారు. సిడ్నీ యూనివ‌ర్శిటీకి చెందిన ప‌రిశోధ‌కులు 2ల‌క్ష‌ల 30వేల‌మంది పై […]

ఆ హాయి... శాప‌మే!
X

తొమ్మిది గంట‌ల‌కు పైగా నిద్ర‌, రోజంత‌టిలో ఎక్కువ గంట‌లు కూర్చునే ఉండ‌టం, శ‌రీరాన్ని అస‌లు శ్ర‌మ పెట్ట‌కపోవ‌డం….ఇవ‌న్నీ పైకి జీవితాన్ని ఎంజాయి చేయ‌డం లాగే క‌నిపించినా ఈ హాయిలో ఉన్న‌దంతా శాప‌మేన‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంత‌కీ ఇలాంటి జీవ‌న శైలి ఎలాంటి ముప్పు తెచ్చిపెడుతుంది…అనే వివ‌రాల్లోకి వెళితే-

  • స్లీప్‌, సిట్టింగ్ ఇవి రెండూ క‌లిసి ఆరోగ్యాన్ని ఎలా హ‌రించివేస్తాయ‌నే విష‌యం మీద నిపుణులు అధ్య‌య‌నం చేశారు. సిడ్నీ యూనివ‌ర్శిటీకి చెందిన ప‌రిశోధ‌కులు 2ల‌క్ష‌ల 30వేల‌మంది పై ఈ అధ్యయ‌నాలు నిర్వ‌హించారు.
  • ఒక మ‌నిషి రోజులో ఎక్కువ స‌మ‌యం నిద్ర‌పోవ‌డం, అలాగే చాలా స‌మ‌యాన్ని కూర్చుని గ‌డిపేయ‌డం ఈ రెండింటితో పాటు శారీర‌క వ్యాయామం సైతం లేక‌పోతే ఇక ఈ మూడూ క‌లిసి ఆ వ్య‌క్తి ఆరోగ్యం మీద ముప్పేట దాడి చేస్తాయ‌ట‌. ఇలాంటి జీవ‌న‌శైలి ఉన్న‌వారు మిగిలిన‌వారికంటే త్వ‌ర‌గా మ‌ర‌ణించే ప్ర‌మాదం నాలుగు రెట్లు అధికంగా ఉంద‌ట‌.
  • రోజుకి ఏడుగంటల కంటే అధికంగా కూర్చుని ఉండ‌టం, వారానికి 150 నిముషాల‌కంటే త‌క్కువ‌గా వ్యాయామం చేయ‌డం…ఇవి రెండూ ప్ర‌ధానంగా అనారోగ్య హేతువులు.
  • ఈ బ‌ద్ధ‌క‌పు జీవ‌న శైలిని మ‌ద్య‌పానం, అనారోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అల‌వాట్లతో స‌మానంగా ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు.
  • అధిక స‌మ‌యం కూర్చుని ఉండ‌టం, వ్యాయామం లేక‌పోవ‌డం, మ‌రీ త‌క్కువ‌, లేదా మ‌రీ ఎక్కువ నిద్రల‌తో పాటు పొగ తాగ‌టం, ఆల్క‌హాల్ అల‌వాటు, పోష‌కాహార లోపం త‌దిత‌ర అంశాల‌ను సైతం అధ్య‌య‌నంలోకి తీసుకుని ప‌రిశీలించారు.
  • బ‌ద్ద‌క‌పు జీవ‌న‌శైలి ఉన్న‌వారి లాగానే, పొగ‌తాగ‌టం, ఆల్క‌హాల్‌, ఏడుగంట‌ల కంటే త‌క్కువ నిద్ర అల‌వాట్లు ఉన్న‌వారు సైతం జీవిత‌కాలాన్ని చేతులారా త‌గ్గించుకుంటున్నార‌ని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. వీరికి కూడా మిగిలిన‌వారికంటే త్వ‌ర‌గా మ‌ర‌ణించే ప్ర‌మాదం నాలుగురెట్లు అధికంగా ఉంది.
First Published:  25 Dec 2015 9:55 AM GMT
Next Story