Telugu Global
Cinema & Entertainment

 తాప్సీ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టింది

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై, తరువాత నార్త్ మీద దృష్టి పెట్టిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఇప్పటి వరకు కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటి కూడా లేకపోయినా ఆసక్తికరమైన సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఈ మధ్యే అక్షయ్ కుమార్ సరసన బేబి సినిమాతో యాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ ఓ క్రేజీ ఆఫర్ ను కొట్టేసింది. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ […]

 తాప్సీ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టింది
X
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమై, తరువాత నార్త్ మీద దృష్టి పెట్టిన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ఇప్పటి వరకు కెరీర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఒక్కటి కూడా లేకపోయినా ఆసక్తికరమైన సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఈ మధ్యే అక్షయ్ కుమార్ సరసన బేబి సినిమాతో యాక్షన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ తమిళ సినిమాతో పాటు రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ ఓ క్రేజీ ఆఫర్ ను కొట్టేసింది.
బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న సందేశాత్మక చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనుంది. బిగ్ బి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఛాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతుంది ఈ అమ్మడు. పూర్తిగా ఢిల్లీలో షూటింగ్ జరగనున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది తాప్సీ.
First Published:  23 Dec 2015 7:11 PM GMT
Next Story