Telugu Global
Cinema & Entertainment

ఆ లాంఛనం కూడా పూర్తయింది

బెంగాల్ టైగర్ కు సంబంధించి మిగిలిన ఆ ఒక్క లాంఛనం కూడా పూర్తయింది. సినిమా నికార్సైన ఫ్లాప్ అని చెప్పడానికి ఓవర్సీస్ లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు కోటి 30లక్షల రూపాయలు పెట్టి హక్కులు కొనుక్కున్నాడు ఓ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడీ సినిమా ఓవర్సీస్ లో ఎక్కడా ఆడడం లేదు. కనీసం ఒక్క థియేటర్‌లో కూడా లేదు. ఫైనల్ గా లెక్కలు తీస్తే…. బెంగాల్ టైగర్ సినిమాకు ఓవర్సీస్ లో 45లక్షల […]

ఆ లాంఛనం కూడా పూర్తయింది
X
బెంగాల్ టైగర్ కు సంబంధించి మిగిలిన ఆ ఒక్క లాంఛనం కూడా పూర్తయింది. సినిమా నికార్సైన ఫ్లాప్ అని చెప్పడానికి ఓవర్సీస్ లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఓవర్సీస్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు కోటి 30లక్షల రూపాయలు పెట్టి హక్కులు కొనుక్కున్నాడు ఓ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడీ సినిమా ఓవర్సీస్ లో ఎక్కడా ఆడడం లేదు. కనీసం ఒక్క థియేటర్‌లో కూడా లేదు. ఫైనల్ గా లెక్కలు తీస్తే…. బెంగాల్ టైగర్ సినిమాకు ఓవర్సీస్ లో 45లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. అమెరికా, యూకే కాకుండా మిగతా దేశాల్లో సినిమాని విడుదల చేసేందుకు మరో 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు సదరు నిర్మాత. వచ్చిన 45కు ఈ 12 కలుపుకుంటే… మొత్తంగా 57లక్షల రూపాయలు మాత్రమే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు వచ్చాయి. సో… కోటి 30లక్షలు పెట్టి సినిమా కొంటే 57లక్షలు మాత్రమే వచ్చాయమన్నమాట. ఇక నైజాం, ఆంధ్రాలో కూడా ఈ సినిమా పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇదీ మొత్తంగా బెంగాల్ టైగర్ కథ…. వ్యథ.
First Published:  23 Dec 2015 7:02 PM GMT
Next Story