Telugu Global
Others

జగన్‌కు సవాల్ విసిరిన లోకేష్‌

టీడీపీ నేత నారా లోకేష్, ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ద్వారా చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు రోజుకు కోటి రూపాయలు వస్తోందంటూ జగన్‌ చేసిన ఆరోపణ విషయంలో లోకేష్‌ ఈ చాలెంజ్ చేశారు. ”జగన్‌ నేను సవాల్ విసురుతున్నా … ఈ రోజు నీవు చేసిన ఆరోపణలు నిరూపించు” అంటూ ట్విట్టర్ ద్వారా ఈ సవాల్ విసిరారు లోకేష్. తనకు ఎలాంటి చట్టవిరుద్ద వ్యవహారాల్లో ప్రమేయం ఉన్నా వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. […]

జగన్‌కు సవాల్ విసిరిన లోకేష్‌
X

టీడీపీ నేత నారా లోకేష్, ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ద్వారా చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు రోజుకు కోటి రూపాయలు వస్తోందంటూ జగన్‌ చేసిన ఆరోపణ విషయంలో లోకేష్‌ ఈ చాలెంజ్ చేశారు. ”జగన్‌ నేను సవాల్ విసురుతున్నా … ఈ రోజు నీవు చేసిన ఆరోపణలు నిరూపించు” అంటూ ట్విట్టర్ ద్వారా ఈ సవాల్ విసిరారు లోకేష్. తనకు ఎలాంటి చట్టవిరుద్ద వ్యవహారాల్లో ప్రమేయం ఉన్నా వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. తాను జగన్‌లా కాదని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని లోకేష్ చెప్పారు. ”నా ఇమేజ్‌ను దెబ్బతీయడానికి నీ చేతనైనంత వరకూ ప్రయత్నించు… కానీ అలా చేయడం నీ వల్ల కాదు” అంటూ జగన్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు లోకేష్ బాబు.

First Published:  23 Dec 2015 9:55 AM GMT
Next Story