Telugu Global
Others

అయుత చండీయాగం ప్రారంభం

మెదక్ జిల్లా ఎర్రవల్లి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగానికి శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో రుత్విజులు శాస్త్రోక్తంగా యాగాన్ని ప్రారంభించారు. ముందుగా యాగాధిపతి అయిన సీఎం కేసీఆర్ రుత్విజులతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం యాగం నిర్వహించే ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అనంతరం గురు ప్రార్థనతో అయుత మహా చండీయాగం ప్రారంభమైంది. రుత్విజుల వేదఘోషతో యాగస్థలం ప్రతిధ్వనిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతోపాటు గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. […]

అయుత చండీయాగం ప్రారంభం
X
మెదక్ జిల్లా ఎర్రవల్లి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగానికి శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో రుత్విజులు శాస్త్రోక్తంగా యాగాన్ని ప్రారంభించారు. ముందుగా యాగాధిపతి అయిన సీఎం కేసీఆర్ రుత్విజులతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం యాగం నిర్వహించే ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అనంతరం గురు ప్రార్థనతో అయుత మహా చండీయాగం ప్రారంభమైంది. రుత్విజుల వేదఘోషతో యాగస్థలం ప్రతిధ్వనిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులతోపాటు గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.
యాగశాలలోనికి యాగకర్తలకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. శాస్త్రోక్తంగా నిర్ణయించిన హోమద్రవ్యాలతో యాగం కొనసాగుతుంది. పూర్తి నియమ నిష్టలతో రుత్విజులు, యాగకర్తలు యాగం నిర్వహిస్తున్నారు. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, అయుత మహా చండీయాగం జరగనుంది. అయుత మహా చండీయాగంలో భాగంగా ఇవాళ మొదటి రోజు వెయ్యి చండీ పారాయణాలు, 40లక్షల నవార్ణమంత్ర జపాలు చేస్తారు.
ఈ సందర్భంగా అయుత మహా చండీయాగాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివస్తున్నారు. రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక వేత్తల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తోంది. యాగాన్ని 4వేల మంది తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి రోజూ 50వేల మందికి అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశారు.
First Published:  22 Dec 2015 11:59 PM GMT
Next Story