Telugu Global
Cinema & Entertainment

పూరి, చార్మి మధ్య తెగిన స్నేహ బంధం

టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా… చాలా సన్నిహితంగా మెలిగే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి చార్మి మధ్య స్నేహం చెడింది. ఇద్దరూ ఇప్పుడు కలవడం లేదని సమాచారం. అయితే ఏవో గొడవలు జరిగి కాదు. ఇద్దరి కేరీర్‌ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. కొన్నేళ్లుగా పూరితో చార్మి స్నేహం బలపడింది. చార్మి ఎక్కువగా పూరి ఆఫీస్‌లోనే కనిపించేవారు. అయితే ఈ ధోరణి వల్ల చార్మి, పూరి ఇద్దరూ నష్టపోయారని సమాచారం. అదేలా అంటే పూరి ఆఫీస్‌లో చార్మి […]

పూరి, చార్మి మధ్య తెగిన స్నేహ బంధం
X

టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా… చాలా సన్నిహితంగా మెలిగే డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి చార్మి మధ్య స్నేహం చెడింది. ఇద్దరూ ఇప్పుడు కలవడం లేదని సమాచారం. అయితే ఏవో గొడవలు జరిగి కాదు. ఇద్దరి కేరీర్‌ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. కొన్నేళ్లుగా పూరితో చార్మి స్నేహం బలపడింది. చార్మి ఎక్కువగా పూరి ఆఫీస్‌లోనే కనిపించేవారు. అయితే ఈ ధోరణి వల్ల చార్మి, పూరి ఇద్దరూ నష్టపోయారని సమాచారం. అదేలా అంటే పూరి ఆఫీస్‌లో చార్మి ఎక్కువగా ఉండే సరికి డైరెక్టర్లు గానీ, నిర్మాతలు గాని ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదట. లేడి ఓరియంట్ సినిమా కోసం చార్మిని సంప్రదించాలనుకున్నా చాలా మంది పూరితో ఆమె స్నేహాన్ని చూసి వెనక్కు తగ్గారని చెబుతున్నారు. అదే సమయంలో పూరి ఆఫీస్‌లో చార్మి ఎక్కువగా ఉండడంతో కథలు వినిపించాలనుకుంటున్న రచయితలు, దర్శకులు, నిర్మాతలు పూరిని కలిసేందుకు ఇబ్బందిపడుతున్నారట. పైగా కథను చార్మి కూడా వింటుండడం వారికి ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. ఇటీవల చార్మి అవకాశాలు తగ్గిపోవడానికి కారణం కూడా ఇదేనని టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పూరి, చార్మి ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అయితే పూరి, చార్మి ఇప్పటికీ మంచి స్నేహితులేనని వారి సన్నిహితులు చెబుతున్నారు. పూరి కన్నా ముందు ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌తో చార్మి స్నేహిం నడిపారు.

First Published:  22 Dec 2015 1:05 AM GMT
Next Story