Telugu Global
Cinema & Entertainment

ఆసక్తి రేపుతున్న టైటిల్స్

  కొన్ని సినిమాలు  కన్ ఫర్మ్ అయ్యాయో లేదో చెప్పడానికి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ఒక కొలమానం. సినిమా టైటిల్ గురించి ముందుగా ప్రకటించినప్పటికీ… రిజిస్ట్రేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది. అలా కొన్ని క్రేజీ టైటిల్స్.. ఈనెలలో రిజిస్టర్ అయ్యాయి. ఇవన్నీ బడా బ్యానర్లు, బడా హీరోల సినిమాలకు సంబంధించినవే కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీప్రసన్న పిక్చర్స్…. ఒకేసారి 3 టైటిల్స్ రిజిస్టర్ చేయించింది. వీటిలో అసెంబ్లీ రౌడీ అనే టైటిల్ తో పాటు […]

ఆసక్తి రేపుతున్న టైటిల్స్
X
కొన్ని సినిమాలు కన్ ఫర్మ్ అయ్యాయో లేదో చెప్పడానికి టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా ఒక కొలమానం. సినిమా టైటిల్ గురించి ముందుగా ప్రకటించినప్పటికీ… రిజిస్ట్రేషన్ మాత్రం చేయాల్సి ఉంటుంది. అలా కొన్ని క్రేజీ టైటిల్స్.. ఈనెలలో రిజిస్టర్ అయ్యాయి. ఇవన్నీ బడా బ్యానర్లు, బడా హీరోల సినిమాలకు సంబంధించినవే కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీప్రసన్న పిక్చర్స్…. ఒకేసారి 3 టైటిల్స్ రిజిస్టర్ చేయించింది. వీటిలో అసెంబ్లీ రౌడీ అనే టైటిల్ తో పాటు లోకల్, రావణ, దుమ్మురేపుతాం అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు, మనోజ్ లతో పాటు మోహన్ బాబు కూడా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో… అసెంబ్లీ రౌడీ టైటిల్ ఈ ముగ్గుర్లో ఎవరికి దక్కుతుందో చూడాలి.
మరోవైపు ఎన్టీఆర్ తో, కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేసిన మైత్రీ మూవీస్ సంస్థ కూడా జనతా గ్యారేజీ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ పేరును సదరు సంస్థ రిజిస్టర్ చేయడం విశేషం. మహేష్, బాలయ్య తో పలు భారీ చిత్రాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ…. తాజాగా మహాలక్ష్మి పెళ్లికి దూరం-150కిమీ అనే టైటిల్ ను నమోదు చేసుకుంది. మరి ఈ టైటిల్ తో ఆ సంస్థ ఏ హీరోను పెట్టి సినిమా చేస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగులో ఎన్టీఆర్ లేదా నాగచైతన్యతో సినిమా ప్లాన్ చేస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ కూడా జస్ట్-36 అనే పేరును రిజిస్టర్ చేయించింది.
Next Story