Telugu Global
Cinema & Entertainment

పాటకైనా...నటనకైనా....రూ.2కోట్లు

నయనతార కనిపిస్తే చాలు తమ సినిమాకు ఆటోమేటిగ్గా పబ్లిసిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు తమిళ నిర్మాతలు. అందుకే ఆమెకు ఎంతైనా ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. నయన్ కూడా తనకు నచ్చినంత తీసుకోవడానికి ఏమాత్రం మొహమాటపడడం లేదు. డిమాండ్ చేసి పారితోషికం పిండుతోంది. అది హీరోయిన్ రోల్ అయినా… ఐటెంసాంగ్ అయినా రెమ్యూనరేషన్ మాత్రం ఒకటే అంటోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు…తమిళనాట రూ.2కోట్ల రూపాయలు తీసుకుంటోంది. అయితే ఆమెతో ఐటెంసాంగ్ చేయించాలనే నిర్మాతల సంఖ్య కూడా బాగానే ఉంది. ఇందులో భాగంగా… 5 రోజుల […]

పాటకైనా...నటనకైనా....రూ.2కోట్లు
X
నయనతార కనిపిస్తే చాలు తమ సినిమాకు ఆటోమేటిగ్గా పబ్లిసిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు తమిళ నిర్మాతలు. అందుకే ఆమెకు ఎంతైనా ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. నయన్ కూడా తనకు నచ్చినంత తీసుకోవడానికి ఏమాత్రం మొహమాటపడడం లేదు. డిమాండ్ చేసి పారితోషికం పిండుతోంది. అది హీరోయిన్ రోల్ అయినా… ఐటెంసాంగ్ అయినా రెమ్యూనరేషన్ మాత్రం ఒకటే అంటోంది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు…తమిళనాట రూ.2కోట్ల రూపాయలు తీసుకుంటోంది. అయితే ఆమెతో ఐటెంసాంగ్ చేయించాలనే నిర్మాతల సంఖ్య కూడా బాగానే ఉంది. ఇందులో భాగంగా… 5 రోజుల కాల్షీట్ ఇచ్చే ఐటెంసాంగ్ కు కూడా 2 కోట్లు తీసుకోవాలని డిసైడ్ అయింది.
తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నఓ సినిమాలో ఐటెంసాంగ్ చేసేందుకు ఒప్పుకుంది నయన్. ఈ సినిమాపై మొన్నటివరకు పెద్దగా అంచనాల్లేవ్. కానీ నయనతార ఐటెంసాంగ్ చేస్తుందనే న్యూస్ వచ్చినప్పటి నుంచి అంతా ఆ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. నిర్మాతలకు కావాల్సింది అదే కదా… అందుకే నయన్ అడిగినంత సమర్పించుకున్నారు.
First Published:  21 Dec 2015 7:05 PM GMT
Next Story