Telugu Global
Cinema & Entertainment

అభిమానులకు క్లాస్ పీకిన మహేష్

  మ్యాగ్జిమమ్ సహనంతో ఉండడానికి ప్రయత్నిస్తాడు మహేష్. ఎంత షూటింగ్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ తన దగ్గరకు వస్తున్న ఫ్యాన్స్ ను చిరునవ్వుతో పలకరిస్తాడు. వాళ్లతో ఓపిగ్గా సెల్ఫీలు దిగుతుంటాడు. ఇంకాస్త టైమ్ దొరికితే క్షేమ సమాచారాలు కూడా కనుక్కుంటాడు. అలాంటి మహేష్ కు తిక్కరేగింది. ఏకంగా ఫ్యాన్స్ అందరినీ వరుసగా నిలబెట్టి క్లాస్ పీకేశాడు. ఊటీలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం మహేష్..బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ […]

అభిమానులకు క్లాస్ పీకిన మహేష్
X
మ్యాగ్జిమమ్ సహనంతో ఉండడానికి ప్రయత్నిస్తాడు మహేష్. ఎంత షూటింగ్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ తన దగ్గరకు వస్తున్న ఫ్యాన్స్ ను చిరునవ్వుతో పలకరిస్తాడు. వాళ్లతో ఓపిగ్గా సెల్ఫీలు దిగుతుంటాడు. ఇంకాస్త టైమ్ దొరికితే క్షేమ సమాచారాలు కూడా కనుక్కుంటాడు. అలాంటి మహేష్ కు తిక్కరేగింది. ఏకంగా ఫ్యాన్స్ అందరినీ వరుసగా నిలబెట్టి క్లాస్ పీకేశాడు. ఊటీలో ఈ సంఘటన జరిగింది.
ప్రస్తుతం మహేష్..బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అసలే చలికాలం… ఆపై ఊటీ. చలి ఏ రేంజ్ లో ఉంటుందో ఎవరైనా అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చుట్టుపక్కల అన్నీ గడ్డకట్టుకుపోయాయి. అంతటి చలిలో మహేష్ షూటింగ్ చేస్తుంటే… అతడ్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వస్తున్నారట. అప్పటికీ ఓపిగ్గా కొందరికి ఆటోగ్రాఫులు, సెల్ఫీలకు స్టిల్స్ ఇచ్చాడట మహేష్. కానీ తన కోసం చాలా దూరం నుంచి ఫ్యాన్స్ వస్తున్నారనే విషయం తెలుసుకొని మండిపడ్డాడు. ఇంత చలిలో తన కోసం అంత దూరం వస్తున్న అభిమానులకు రావొద్దని సూచించాడు మహేష్. వాళ్లందరికీ చిన్న క్లాస్ పీకాడు.
First Published:  21 Dec 2015 7:07 PM GMT
Next Story