Telugu Global
Cinema & Entertainment

వారంలో లోఫర్ పనైపోయింది

  పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో, వరుణ్ తేజ హీరోగా గ్రాండ్ గా విడుదలైంది లోఫర్ సినిమా. అంచనాలు భారీగా ఉండడంతో…. సినిమాకు మొదటి రోజు జనాలు పోటెత్తాడు. తన 3 సినిమాల కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ వసూళ్లు దీనితోనే అందుకున్నాడు వరుణ్ తేజ. అదే ఊపులో సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని కలలుకన్నాడు. కానీ పూరి జగన్నాధ్ మేజిక్ ఈమధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్ పై పనిచేయడం లేదు. ఒకే తరహా కథలు, కథనాలు, క్యారెక్టరైజేషన్లు. […]

వారంలో లోఫర్ పనైపోయింది
X
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో, వరుణ్ తేజ హీరోగా గ్రాండ్ గా విడుదలైంది లోఫర్ సినిమా. అంచనాలు భారీగా ఉండడంతో…. సినిమాకు మొదటి రోజు జనాలు పోటెత్తాడు. తన 3 సినిమాల కెరీర్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ వసూళ్లు దీనితోనే అందుకున్నాడు వరుణ్ తేజ. అదే ఊపులో సినిమా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని కలలుకన్నాడు. కానీ పూరి జగన్నాధ్ మేజిక్ ఈమధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్ పై పనిచేయడం లేదు. ఒకే తరహా కథలు, కథనాలు, క్యారెక్టరైజేషన్లు. లోఫర్ కూడా దీనికి అతీతమేం కాదు. అందుకే సినిమా వారం రోజులకే మూటముళ్లే సర్దేసింది. ఈ వీకెండ్ నాటికి వచ్చిన వసూళ్లు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఆదివారం రాత్రికి లోఫర్ సినిమా ఏపీ, తెలంగాణలో కలుపుకొని 7కోట్ల 18లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది. క్రిస్మస్ సీజన్ లో కూడా ఈ సినిమానే హాట్ ఫేవరెట్ గా నిలుస్తుందని భావించిన మేకర్స్ కు లోఫర్ షాకిచ్చింది. క్రిస్మస్ కు 3 రోజుల ముందే బిచానా ఎత్తేసింది. సోమవారం ఈ సినిమా ఆక్యుపెన్సీ 30శాతం కూడా లేదట. ఇక క్రిస్మస్ వరకు ఇది ఆడుతుందనుకుంటే అది భ్రమే అవుతుంది.
First Published:  21 Dec 2015 7:08 PM GMT
Next Story