Telugu Global
Cinema & Entertainment

బాలయ్యది అసలు కంటే కొసరే బాగుంది " డిక్టేటర్ ట్రయిలర్ రివ్యూ

  నూతన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా… ఏపీ రాజధాని అమరావతిలో ఆడియో ఫంక్షన్ నిర్వహించామనే ఘనతను దక్కించుకున్నాడు నందమూరి నటసింహం. తన సంక్రాంతి స్పెషల్…. డిక్టేటర్ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేశారు. అనుకోని కారణాల వల్ల సీఎం రాకపోయినప్పటికీ…. పొలిటికల్ టచ్ బాగానే కనిపించింది. ఇదే వేడుకలో డిక్టేటర్ థియేట్రికల్ ట్రయిలర్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే ట్రయిలర్ కు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అయితే టీజర్ తో కంపేర్ చేసి చూస్తే…. తాజాగా […]

బాలయ్యది అసలు కంటే కొసరే బాగుంది  డిక్టేటర్ ట్రయిలర్ రివ్యూ
X
నూతన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారిగా… ఏపీ రాజధాని అమరావతిలో ఆడియో ఫంక్షన్ నిర్వహించామనే ఘనతను దక్కించుకున్నాడు నందమూరి నటసింహం. తన సంక్రాంతి స్పెషల్…. డిక్టేటర్ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేశారు. అనుకోని కారణాల వల్ల సీఎం రాకపోయినప్పటికీ…. పొలిటికల్ టచ్ బాగానే కనిపించింది. ఇదే వేడుకలో డిక్టేటర్ థియేట్రికల్ ట్రయిలర్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే ట్రయిలర్ కు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అయితే టీజర్ తో కంపేర్ చేసి చూస్తే…. తాజాగా విడుదలైన ట్రయిలర్ కంటే …. గతంలో వచ్చిన టీజరే సూపర్ అంటున్నారు విశ్లేషకులు. టీజర్ లో కనిపించిన పంచ్…ట్రయిలర్ లో మిస్ అయిందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తంచేస్తున్నారు.
బాలయ్య సినిమాలకు ఎన్నడూ లేని విధంగా…. డిక్టేటర్ సినిమాతో కోనవెంకట్-గోపీమోహన్ కలిసి చేశారు. ఆ జంట ఎంట్రీ డిక్టేటర్ థియేట్రికల్ ట్రయిలర్ లో స్పష్టంగా కనిపించింది. ట్రయిలర్ నిండా బాలయ్యే కనిపించాలని కోరుకునే అభిమానులకు… తమ అభిమాన హీరో కంటే ఎక్కువగా సైడ్ క్యారెక్టర్లు, కమెడియన్లు కనిపించేసరికి నిరాశచెందారు. ఇది కచ్చితంగా కోనవెంకట్ మార్కే. పైగా…. గతంలో వచ్చిన టీజర్ తో పోలిస్తే… ట్రయిలర్ లో ల్యాగ్ ఎక్కువై గ్రిప్పింగ్ మిస్ అయింది. అందుకే చాలామంది నందమూరి ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ… ట్రయిలర్ కు ఆన్ లైన్ లో మంచి రెస్పాన్స్ వస్తుండడం బాలయ్య ఇమేజ్‌కు నిదర్శనం.
First Published:  21 Dec 2015 7:02 PM GMT
Next Story