Telugu Global
Cinema & Entertainment

ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఇద్దరు జంప్

హీరోగా ఇప్పటికే తనదైన మార్క్ వేసుకున్న హ్యాపీడేస్ నిఖిల్…. త్వరలోనే మరో ఎంటర్ టైనర్ కు రెడీ అయ్యాడు. తాజా చిత్రం శంకరాభరణం ఫ్లాప్ అయినప్పటికీ… నిఖిల్ మాత్రం మరో మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే… ఆ సినిమాలో ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇలా ముగ్గురు భామలతో ఇంతవరకు సినిమా చేయలేదు కాబట్టి… డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిఖిల్. కానీ ఇంతలోనే […]

ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఇద్దరు జంప్
X
హీరోగా ఇప్పటికే తనదైన మార్క్ వేసుకున్న హ్యాపీడేస్ నిఖిల్…. త్వరలోనే మరో ఎంటర్ టైనర్ కు రెడీ అయ్యాడు. తాజా చిత్రం శంకరాభరణం ఫ్లాప్ అయినప్పటికీ… నిఖిల్ మాత్రం మరో మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే… ఆ సినిమాలో ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇలా ముగ్గురు భామలతో ఇంతవరకు సినిమా చేయలేదు కాబట్టి… డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నిఖిల్. కానీ ఇంతలోనే ముగ్గుర్లో ఇద్దరు భామలు… నిఖిల్ కు షాకిచ్చారు. నిఖిల్ కొత్త సినిమా నుంచి తాప్సి, క్యాథరీన్ థ్రెసా తప్పుకున్నారు. చెప్పిన మొత్తాన్ని వాళ్లకు ఇవ్వకపోవడంతో… ఈ భామలిద్దరూ నిఖిల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కేవలం అవికా గౌర్ మాత్రమే మిగిలింది. మరో ఇద్దరు కోసం మళ్లీ వేట మొదలైంది. కుమారి 21-ఎఫ్ తో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ ను ఒక క్యారెక్టర్ కోసం తీసుకున్నప్పటికీ… ఇంకో హీరోయిన్ కోసం వెదుకున్నారు. అయితే ఎంతమంది హీరోయిన్లను పెట్టుకున్నప్పటికీ… తాప్సి లాంటి కాస్తోకూస్తో పేరున్న భామను మాత్రం మిస్ చేసుకున్నాడు నిఖిల్.
Next Story