Telugu Global
Cinema & Entertainment

ప్రేమ విష‌యంపై నోరు విప్పిన రెజీనా

కొంత‌కాలంగా మీడియాలో తెలుగు హీరోయిన్ రెజీనా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. పాతికేళ్ల ఈ ముద్దుగుమ్మ సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన‌ పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలు వ‌రుసగా విజ‌యాలు సాధించాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ రొమాన్స్ బాగా పండింద‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శంసించారు. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రూ ఆఫ్ ద స్క్రీన్‌లోనూ రొమాన్స్ చేస్తున్నార‌ని రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. ఏకంగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోయార‌ని, త‌ర‌చుగా […]

ప్రేమ విష‌యంపై నోరు విప్పిన రెజీనా
X
కొంత‌కాలంగా మీడియాలో తెలుగు హీరోయిన్ రెజీనా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. పాతికేళ్ల ఈ ముద్దుగుమ్మ సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన‌ పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలు వ‌రుసగా విజ‌యాలు సాధించాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ రొమాన్స్ బాగా పండింద‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శంసించారు. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రూ ఆఫ్ ద స్క్రీన్‌లోనూ రొమాన్స్ చేస్తున్నార‌ని రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. ఏకంగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోయార‌ని, త‌ర‌చుగా క‌లుసుకుంటున్నార‌ని మీడియా కోడై కూసింది.
విక్రమ్ మీన‌న్‌తో..!
ఈ రూమ‌ర్ల‌పై రెజీనా స్పందించింది. ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా ఇవ‌న్నీ వదంతులేన‌ని కొట్టి పారేసింది. రెండు సినిమాలు క‌లిసి చేస్తే ఇలాంటి రూమ‌ర్లు పుట్టుకురావ‌డం స‌హ‌జ‌మేన‌ని తేల్చింది. సాయి త‌న‌కు క్లోజ్ ఫ్రెండ‌ని అంత‌కు మించి త‌మ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రేం లేద‌ని కుండబ‌ద్ద‌లు కొట్టింది. త‌మ ఎఫైర్‌పై వార్త‌లు పుట్టించినందుకు త‌న‌కేం బాధ లేద‌ని చెప్పేసింది. మ‌రోవైపు ఈ అమ్మ‌డి గురించి మ‌రో వార్త గుప్పుమంటోంది. ఈ చెన్నై చిన్న‌ది ఇదివ‌ర‌కే విక్ర‌మ్ మీన‌న్ అనే కుర్రాడితో ప్రేమ‌లో ఉంద‌ని, చాన్స్ దొరికితే వీరిద్ద‌రూ విదేశీ యాత్ర‌ల‌కు వెళుతున్నార‌ని రూమ‌ర్ ఒక‌టి బ‌య‌ల్దేరింది. వీటిపై రెజీనా ఎప్పుడు స్పందిస్తుందో?
First Published:  20 Dec 2015 7:03 PM GMT
Next Story