Telugu Global
Cinema & Entertainment

అందరూ ప‌వ‌న్ జ‌ప‌మేనా?

టాలీవుడ్‌లో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌వా న‌డుస్తోంది. ఏ సినిమా చూసినా.. ఏ వేదిక‌పై ఉన్నా.. ప‌వ‌న్ పేరే వినిపిస్తోంది. వాడుకున్నోడికి వాడుకున్నంత అనుకుంటూ ప‌వ‌న్ పేరును ఇష్ట‌మున్న‌ట్లు వాడేస్తున్నారు. మెగాకాంపౌండ్ హీరోలు ప‌వ‌న్ పేరు వాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. వారికి ప‌వ‌న్‌ బాబాయి.. మావ‌య్య అవుతాడు కాబ‌ట్టి. ఇక‌పోతే చిన్న హీరోలు, చిన్న సినిమాలు ప‌వ‌న్ పేరును జ‌పించారంటే అర్థం ఉంది. క‌నీసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ని అయినా క‌న్వీన్స్ చేస్తే.. అది సినిమాకు […]

అందరూ ప‌వ‌న్ జ‌ప‌మేనా?
X
టాలీవుడ్‌లో ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌వా న‌డుస్తోంది. ఏ సినిమా చూసినా.. ఏ వేదిక‌పై ఉన్నా.. ప‌వ‌న్ పేరే వినిపిస్తోంది. వాడుకున్నోడికి వాడుకున్నంత అనుకుంటూ ప‌వ‌న్ పేరును ఇష్ట‌మున్న‌ట్లు వాడేస్తున్నారు. మెగాకాంపౌండ్ హీరోలు ప‌వ‌న్ పేరు వాడుకున్నారంటే ఒక అర్థం ఉంది. వారికి ప‌వ‌న్‌ బాబాయి.. మావ‌య్య అవుతాడు కాబ‌ట్టి. ఇక‌పోతే చిన్న హీరోలు, చిన్న సినిమాలు ప‌వ‌న్ పేరును జ‌పించారంటే అర్థం ఉంది. క‌నీసం ప‌వ‌న్ ఫ్యాన్స్ ని అయినా క‌న్వీన్స్ చేస్తే.. అది సినిమాకు ప్ల‌స్ అవుతుందన్న‌ది వారి ఆలోచ‌న‌! అయితే, కొంత‌కాలంగా చిన్నోడు, పెద్దోడు తేడా లేకుండా ఎవ‌రు ప‌డితే వారు ప‌వ‌న్ పేరును విప‌రీతంగా వాడేసుకుంటున్నారు. వీరిలో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్ట‌ర్లు ఉండ‌టం మ‌రీ విడ్డూరంగా ఉంది.
నితిన్‌తో మొద‌లై..!
టాలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ నితిన్ హీరో ప‌వ‌న్ కు పెద్ద అభిమాని. ఒక ర‌కంగా చెప్పాలంటే.. మెగా కాంపౌండ్ దాటి ప‌వ‌న్ నామాన్ని జ‌పించిన తొలి హీరో! తాను ప‌వ‌న్ అభిమాని కాకుంటే.. అస్స‌లు సినిమా రంగంలోకి వ‌చ్చేవాడినే కాద‌ని చాలాసార్లు ప‌లు వేదిక‌ల‌పై ప్ర‌క‌టించాడు. త‌న సినిమాల్లోనూ ప‌వ‌న్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నాడు. జ‌న‌సేన పార్టీ పెట్టాక ప‌వ‌న్ నామ‌స్మ‌ర‌ణం క్ర‌మంగా పెర‌గ‌డం ప్రారంభ‌మైంది. ర‌చ‌యిత కోన వెంక‌ట్‌, స్టార్ డైరెక్ట‌ర్లు పూరీ జ‌గ‌న్నాథ్‌, సంప‌త్ నంది, హ‌రీశ్ శంక‌ర్ లాంటి వారు కూడా త‌మ సినిమాల్లో ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం. ప‌వ‌న్ సినిమా పాట‌ల‌కు స్పూఫ్‌లు పెట్ట‌డం లాంటివి చేస్తుండటం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, శంక‌రాభ‌ర‌ణం, లోఫ‌ర్‌, బెంగాల్ టైగ‌ర్‌లో ప‌వ‌న్ పేరును కావాల్సినంత వాడుకున్నారు. మొత్తానికి ప‌వ‌న్ పేరు జ‌పిస్తే.. వ‌సూళ్లు బాగుంటాయ‌ని ఇలా చేస్తున్నార‌న్న‌ది మాత్రం సుస్ప‌ష్టం.
First Published:  20 Dec 2015 7:02 PM GMT
Next Story