Telugu Global
Cinema & Entertainment

హీరో హిట్ అంటాడు.. నిర్మాత ఫ్లాప్ అంటాడు..

బెంగాల్ టైగర్ ముచ్చట ఇది. ప్రేక్షకుల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయో… ఇప్పుడు హీరో-నిర్మాత మధ్య కూడా అలాంటి అభిప్రాయాలే తలెత్తాయి. సగం మంది ప్రేక్షకులు బెంగాల్ టైగర్ హిట్ అంటుంటే… మిగతా సగం మంది  సినిమా ఫ్లాప్ అంటున్నారు. అదే విధంగా హీరో రవితేజ తన సినిమా సక్సెస్ అయిందని చెబుతున్నాడు. కానీ బెంగాల్  టైగర్ నిర్మాత మాత్రం అది పక్కా యావరేజ్ మూవీ అంటున్నారు. ఇలా హీరో-నిర్మాత ఇద్దరూ తలో విధంగా మాట్లాడ్డానికి డబ్బుల వ్యవహారమే కారణమనేది ఇన్ సైడ్ […]

హీరో హిట్ అంటాడు.. నిర్మాత ఫ్లాప్ అంటాడు..
X
బెంగాల్ టైగర్ ముచ్చట ఇది. ప్రేక్షకుల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయో… ఇప్పుడు హీరో-నిర్మాత మధ్య కూడా అలాంటి అభిప్రాయాలే తలెత్తాయి. సగం మంది ప్రేక్షకులు బెంగాల్ టైగర్ హిట్ అంటుంటే… మిగతా సగం మంది
సినిమా ఫ్లాప్ అంటున్నారు. అదే విధంగా హీరో రవితేజ తన సినిమా సక్సెస్ అయిందని చెబుతున్నాడు. కానీ బెంగాల్ టైగర్ నిర్మాత మాత్రం అది పక్కా యావరేజ్ మూవీ అంటున్నారు. ఇలా హీరో-నిర్మాత ఇద్దరూ తలో విధంగా మాట్లాడ్డానికి డబ్బుల వ్యవహారమే కారణమనేది ఇన్ సైడ్ టాక్.
మేటర్ ఏంటంటే… తీసుకున్న రెమ్యునరేషన్ కాకుండా… .సినిమా హిట్టయితే మరో కోటి రూపాయలు అదనంగా ఇచ్చుకోవాలని సెట్స్ పైకి వెళ్లకముందే రవితేజ-నిర్మాత ఓ మాట అనుకున్నారట. దీనికి నిర్మాత కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు సినిమా హిట్టయింది కాబట్టి తనకు కోటి రూపాయలు ఇమ్మంటున్నాడట రవితేజ. కానీ సినిమా యావరేజ్ తోనే ముగిసింది… తనకు ఏం లాభాలు రాలేదంటున్నాడట నిర్మాత. అదండీ సంగతి…. వాళ్లిద్దరూ తేల్చుకున్న తర్వాతే బెంగాల్ టైగర్…. హిట్టా-ఫట్టా అనే విషయం తేలుతుంది. అది ఫైనల్ కూడా.
First Published:  19 Dec 2015 7:02 PM GMT
Next Story