Telugu Global
Others

జగన్‌ చికాకు ఎత్తుగడ

సాధారణంగా మనం ఒక వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశామనుకోండి. అవతలి వ్యక్తి కూడా అదే స్థాయిలో స్పందించకుండా నవ్వుతూ వెళ్లిపోతే ఎలా అనిపిస్తుంది. మండిపోతుంది. మనమంటే లెక్కలేదా అని కోపం వస్తుంది. కాల్‌మనీపై అసెంబ్లీలో జగన్ మాట్లాడిన తీరు కూడా ఇలాగే ఉంది. జగన్‌ తీరు అధికార పక్షానికి మండేలా చేసిందట. ఎందుకంటే కాల్‌మనీపై స్పీచ్‌ మొదలుపెట్టిన జగన్ తొలుత డ్వాక్రా, రైతుల రుణాల అంశాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ జరక్కపోవడం వల్లే పేదలు కాల్‌మనీ వ్యాపారుల బారినపడుతున్నారని […]

జగన్‌ చికాకు ఎత్తుగడ
X

సాధారణంగా మనం ఒక వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశామనుకోండి. అవతలి వ్యక్తి కూడా అదే స్థాయిలో స్పందించకుండా నవ్వుతూ వెళ్లిపోతే ఎలా అనిపిస్తుంది. మండిపోతుంది. మనమంటే లెక్కలేదా అని కోపం వస్తుంది. కాల్‌మనీపై అసెంబ్లీలో జగన్ మాట్లాడిన తీరు కూడా ఇలాగే ఉంది. జగన్‌ తీరు అధికార పక్షానికి మండేలా చేసిందట.

ఎందుకంటే కాల్‌మనీపై స్పీచ్‌ మొదలుపెట్టిన జగన్ తొలుత డ్వాక్రా, రైతుల రుణాల అంశాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ జరక్కపోవడం వల్లే పేదలు కాల్‌మనీ వ్యాపారుల బారినపడుతున్నారని చెప్పడం ఆయన ఉద్దేశం కాబోలు. అయితే జగన్‌ రుణమాఫీపై మాట్లాడకుండా అడ్డుకునేందుకు అధికారపక్షం ఎత్తు వేసింది. తొలుత మంత్రి మృణాళిని లేచి ” అదేంటి అధ్యక్ష… కాల్‌ మనీపై మాట్లాడకుండా అనవసర అంశాలు మాట్లాడుతున్నారు” అంటూ ఓ రెండు నిమిషాలు జగన్‌ను ఆమె విమర్శించారు. మంత్రి అభ్యంతరంపై జగన్‌ స్పందిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అసలు మంత్రి మాటలను తాను వినలేదన్నట్టు జగన్ మళ్లీ డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించారు. ఈసారి కాల్వ శ్రీనివాస్‌ లేచారు.

సబ్జెక్ట్ మాట్లాడకుండా రుణమాఫీ గురించి మాట్లాడడం ఏమిటంటూ ఆయన కూడా ఓ రెండు నిమిషాలు వ్యక్తిగత అంశాలనూ కలిపి జగన్‌ను విమర్శించారు. అప్పుడు కూడా జగన్ స్పందించలేదు. కాల్వ శ్రీనివాస్‌ మాటలతో తనకు సంబంధం లేదన్నట్టుగా తిరిగి రుణమాఫీ అంశాన్ని లేవనెత్తారు. ఇలా అచ్చెన్నాయుడుతో పాటు మరికొందరు అధికార పార్టీ నేతలు కూడా రుణమాఫీ గురించి జగన్‌ మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ జగన్‌ మాత్రం అవేవి పట్టించుకోలేదు. ఇక్కడే అధికార పార్టీకి మండింది. ఇంతమంది మంత్రులు,సీనియర్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు కనీసం స్పందించకుండా జగన్ ఒకే లైన్‌లో మాట్లాడడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. ఒక్క ముఖ్యమంత్రి మాటలకు మాత్రమే జగన్ స్పందిస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేల కామెంట్స్‌ను జగన్‌ లెక్కచేయడం లేదని… ఇది ఆయన అహంకానికి నిదర్శనమని టీడీపీ నేతలంటున్నారు.

వైసీపీ వాళ్లు మాత్రం ”మా వ్యూహాలు మాకుంటాయ్ బాస్” అంటున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావాలనే జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వారి ట్రాప్‌లో పడితే ఏమవుతుందో తమకు తెలుసంటున్నారు. అంటే ఎదుటి వారి తిట్లను, విమర్శలను పరిగణలోకి తీసుకుని తిరిగి తిట్టకపోతే అవతలివారికి మండుతుందన్న మాట!.

First Published:  20 Dec 2015 2:06 AM GMT
Next Story