Telugu Global
Cinema & Entertainment

నిజంగా ఇవి బ్రహ్మోత్సవం డైలాగులేనా ?

సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు. సమస్యలు అలలు లాంటివి..వస్తుంటాయి-పోతుంటాయి. నువ్వు తీరంలా స్ట్రాంగ్ గా ఉండాలి. నలుగురిలో ఉండడం అంటే నీ ఇంట్లో 4 గోడల మధ్య ఉండడం కాదు… నలుగురు గుర్తించేలా ఉండాలి. ప్రస్తుతం ఇవే డైలాగులు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాలోనివే ఈ డైలాగులంటూ ప్రచారం కూడా జరుగుతోంది. కానీ సినిమా విడుదలయ్యేంత వరకు ఇందులో ఎన్ని సిసలైన డైలాగులో… మరెన్ని నకిలీవో […]

నిజంగా ఇవి బ్రహ్మోత్సవం డైలాగులేనా ?
X
  • సముద్రంలో నీరు, అసమర్థుడి దగ్గర డబ్బు ఎంతున్నా ప్రయోజనం ఉండదు.
  • సమస్యలు అలలు లాంటివి..వస్తుంటాయి-పోతుంటాయి. నువ్వు తీరంలా స్ట్రాంగ్ గా ఉండాలి.
  • నలుగురిలో ఉండడం అంటే నీ ఇంట్లో 4 గోడల మధ్య ఉండడం కాదు… నలుగురు గుర్తించేలా ఉండాలి.

ప్రస్తుతం ఇవే డైలాగులు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాలోనివే ఈ డైలాగులంటూ ప్రచారం కూడా జరుగుతోంది. కానీ సినిమా విడుదలయ్యేంత వరకు ఇందులో ఎన్ని సిసలైన డైలాగులో… మరెన్ని నకిలీవో తేలుతుంది. గతంలో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, దూకుడు, ఆగడు లాంటి సినిమాలకు సంబంధించి ఇలానే చాలా డైలాగులు నెట్ లో పాపులర్ అయ్యాయి. గమ్మత్తుగా అందులో ఒకట్రెండు డైలాగులు సినిమాలో కూడా ఉన్నాయి. సో…. ఈసారి కూడా బ్రహ్మోత్సవంలో పైన చెప్పుకున్న డైలాగుల్లో కనీసం ఒకటైనా ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదే ఆ డైలాగులంటూ షేర్లు, లైకులు, ట్వీటులతో నెట్ ను ముంచెత్తుతున్నారు.

Next Story