Telugu Global
Cinema & Entertainment

షారూక్ ఖాన్ కు దెబ్బ పడింది

దిల్ వాలే సినిమాతో సల్మాన్ ను అధిగమించేద్దామనుకున్నాడు. నంబర్ వన్ హీరో అనిపించుకుందామని కలలు కన్నాడు. కానీ నోరు జారితే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో షారూక్ ఖాన్ కు ఇప్పుడు తెలిసొచ్చింది. అసహనంపై ఈ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు… దిల్ వాలే సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. థియేటర్లపై రాళ్లు రువ్వారు. గోడలు ఎక్కి మరీ పోస్టర్లు చించి అవతల పడేశారు. షారూక్ కటౌట్లకు […]

షారూక్ ఖాన్ కు దెబ్బ పడింది
X
దిల్ వాలే సినిమాతో సల్మాన్ ను అధిగమించేద్దామనుకున్నాడు. నంబర్ వన్ హీరో అనిపించుకుందామని కలలు కన్నాడు. కానీ నోరు జారితే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో షారూక్ ఖాన్ కు ఇప్పుడు తెలిసొచ్చింది. అసహనంపై ఈ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు… దిల్ వాలే సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. థియేటర్లపై రాళ్లు రువ్వారు. గోడలు ఎక్కి మరీ పోస్టర్లు చించి అవతల పడేశారు. షారూక్ కటౌట్లకు నిప్పుపెట్టారు. బైక్ పార్కింగ్ లో ఉన్న బైక్స్ అన్నింటినీ తోసేశారు. ఇలా నానా బీభత్సం చేయడంతో… దిల్ వాలే సినిమాకు మొదటి రోజు 60శాతం ఆక్యుపెన్సీ మాత్రం లభించింది. దీంతో ఆటోమేటిగ్గా వసూళ్లు కూడా తగ్గిపోయాయి. ఇప్పటివరకు అధికారికంగా లెక్కలు విడుదల చేయనప్పటికీ… సల్మాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ తొలిరోజు వసూళ్లను…. దిల్ వాలే అధిగమించడం కష్టమే అంటున్నారు బాక్సాఫీస్ విశ్లేషకులు. మరోవైపు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు ఎందుకనో పెద్దగా హైప్ రాలేదు. ఓవైపు యాక్షన్ ట్రయిలర్ విడుదల చేసి… మరోవైపు రొమాంటిక్ యాంగిల్ చూపించడంతో… అసలు ఇది ఏ తరహా సినిమానో అర్థంకాక డైలమాలో పడిపోయారు ఓవర్సీస్ ప్రేక్షకులు. ఈ అంశం కూడా ఆ సినిమాకు నెగెటివ్ గా మారింది. మొత్తమ్మీద షారూక్ వ్యాఖ్యలే సినిమాకు పెద్ద మైనస్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. మరో 3రోజులు బీజేపీ, శివసేన, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు… ఆందోళనలు ఉధృతం చేస్తే కనుక దిల్ వాలే సినిమా మూటముళ్లు సర్దుకోవడం ఖాయం.
First Published:  18 Dec 2015 7:05 PM GMT
Next Story