Telugu Global
Cinema & Entertainment

అప్పుడు రాజేంద్రప్రసాద్... ఇప్పుడు మోహన్ బాబు...

ఓ విజయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు అల్లరినరేష్. అప్పుడెప్పుడో వచ్చిన సుడిగాడు తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు ఈ అల్లరోడు. పోనీ…. పెళ్లయిన తర్వాత ఏమైనా కలిసొస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో మరో కాంబినేషన్ షురూ చేశాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి సినిమా చేశాడు. మోహన్ బాబు టైమింగ్ కు తన కామెడీ జోడించి హిట్ కొడదామని చూస్తున్నాడు. అప్పట్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ తో కలిసి […]

అప్పుడు రాజేంద్రప్రసాద్... ఇప్పుడు మోహన్ బాబు...
X
ఓ విజయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు అల్లరినరేష్. అప్పుడెప్పుడో వచ్చిన సుడిగాడు తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు ఈ అల్లరోడు. పోనీ…. పెళ్లయిన తర్వాత ఏమైనా కలిసొస్తుందనుకుంటే అది కూడా జరగలేదు. దీంతో మరో కాంబినేషన్ షురూ చేశాడు. డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి సినిమా చేశాడు. మోహన్ బాబు టైమింగ్ కు తన కామెడీ జోడించి హిట్ కొడదామని చూస్తున్నాడు. అప్పట్లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ తో కలిసి మా అల్లుడు వెరీ గుడ్ సినిమా చేశాడు అల్లరినరేష్. అది మంచి విజయాన్నందుకుంది. అందుకే ఇప్పుడు కూడా సక్సెస్ కోసం రాజేంద్రుడి ప్లేస్ లో మోహన్ బాబును పెట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ కు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో కాస్త శాటిస్ ఫై చేసే కామెడీ ఉంటే కచ్చితంగా హిట్టవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. మూవీలో మరీ చెప్పుకోదగ్గ అశ్లీల సన్నివేశాలు లేకపోయినప్పటికీ… డైలాగుల్లో కొన్ని అపశృతులు ఉన్న కారణంగా మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ సినిమాతోనైనా అల్లరోడు… అందర్నీ అలరిస్తాడని ఆశిద్దాం.
First Published:  18 Dec 2015 7:06 PM GMT
Next Story