Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబును మరోసారి కెలికిన కాజల్

బిజినెస్ మేనే టైమ్ లోనే మహేష్ బాబుకు, హీరోయిన్ కాజల్ కు మధ్య గొడవలు జరిగాయనే వార్తలొచ్చాయి. అయినప్పటికీ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసే మహేష్ బాబు… అలాంటి వివాదాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే ఎంత పెద్ద గొడవ జరిగినప్పటికీ… తిరిగి సమంతాకు ఛాన్స్ ఇచ్చాడు. అలాగే కాజల్ కు కూడా అవకాశమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరితో కలిసి బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు మహేష్. అయితే మహేష్ ఇచ్చిన మూడో ఛాన్స్ ను సమంత బాగానే వినియోగించుకుంటోంది […]

మహేష్ బాబును మరోసారి కెలికిన కాజల్
X

బిజినెస్ మేనే టైమ్ లోనే మహేష్ బాబుకు, హీరోయిన్ కాజల్ కు మధ్య గొడవలు జరిగాయనే వార్తలొచ్చాయి. అయినప్పటికీ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసే మహేష్ బాబు… అలాంటి వివాదాల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే ఎంత పెద్ద గొడవ జరిగినప్పటికీ… తిరిగి సమంతాకు ఛాన్స్ ఇచ్చాడు. అలాగే కాజల్ కు కూడా అవకాశమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరితో కలిసి బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు మహేష్. అయితే మహేష్ ఇచ్చిన మూడో ఛాన్స్ ను సమంత బాగానే వినియోగించుకుంటోంది కానీ… కాజల్ మాత్రం మరోసారి మహేష్ ను కెలికి… అతడి ఆగ్రహానికి గురైంది.

తన సినిమా ప్రమోషన్ విషయంలో ఎప్పుడూ పక్కాగా ఉంటాడు మహేష్. దర్శకుడి అనుమతి లేనిదే… తన ట్విట్టర్ లో ఒక్క ఫొటో కూడా పెట్టడు. అలాంటిదే కాజల్ ఏకంగా బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి కొన్ని ఫొటోల్ని ఫేస్ బుక్ లో పెట్టేసింది. ప్రచారాన్ని పక్కాగా ప్లాన్ చేద్దామనుకున్న మహేష్ కు ఇది షాక్ లా తగిలింది. దీంతో కాజల్ ను పిలిచి చెడామడా తిట్టేశాడట. దీంతో ఇద్దరి మధ్య మరోసారి ఫైర్ స్టార్టయిందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

First Published:  17 Dec 2015 7:06 PM GMT
Next Story