Telugu Global
Cinema & Entertainment

డూప్ వ‌ద్ద‌న్న బాల‌య్య‌ ?

ప్రస్తుతం డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ ఫైట్ సీక్వన్స్ ను దాదాపు 150 మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వన్స్ లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి రావటంతో ఆ సీన్స్ ను డూప్ తో చేయించాలని భావించారు చిత్రయూనిట్. అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్ లో నటిస్తున్నాడు. 55 ఏళ్ల […]

డూప్ వ‌ద్ద‌న్న బాల‌య్య‌ ?
X

ప్రస్తుతం డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ ఫైట్ సీక్వన్స్ ను దాదాపు 150 మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వన్స్ లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి రావటంతో ఆ సీన్స్ ను డూప్ తో చేయించాలని భావించారు చిత్రయూనిట్. అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్ లో నటిస్తున్నాడు.

55 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా బాలయ్య చేస్తున్న స్టంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లౌక్యం సక్సెస్ తో సూపర్ ఫాంలో ఉన్న శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.

First Published:  17 Dec 2015 7:11 PM GMT
Next Story