Telugu Global
Others

గోడ దూకుతున్న మరో టీడీపీ ఎమ్మెల్యే

తెలంగాణలో దెబ్బమీద దెబ్బ టీడీపీకి కామన్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. విడతల వారీగా పలువురు ఎమ్మెల్యేలు కారెక్కుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న టీఆర్‌ఎస్‌లో చేరగా ఇప్పుడు గ్రేటర్ పరిధిలో మరో ఊహించని షాక్‌ తగలబోతోంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. గాంధీతో మంత్రి హరీష్‌రావు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌లోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధికి కావాల్సినన్ని నిధులు అందుతాయని అధికార పార్టీ హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సొంత […]

గోడ దూకుతున్న మరో టీడీపీ ఎమ్మెల్యే
X

తెలంగాణలో దెబ్బమీద దెబ్బ టీడీపీకి కామన్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. విడతల వారీగా పలువురు ఎమ్మెల్యేలు కారెక్కుతున్నారు. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న టీఆర్‌ఎస్‌లో చేరగా ఇప్పుడు గ్రేటర్ పరిధిలో మరో ఊహించని షాక్‌ తగలబోతోంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ టీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. గాంధీతో మంత్రి హరీష్‌రావు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌లోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధికి కావాల్సినన్ని నిధులు అందుతాయని అధికార పార్టీ హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన గాంధీతో వారం రోజులుగా హరీష్‌రావు చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. మంత్రి తుమ్మల కూడా గాంధీకి ధైర్యం చెప్పి పార్టీలోకి వస్తే మంచి జరుగుతుందని సూచించారట. మొన్నటి ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో భారీ మెజారిటీతో గాంధీ విజయం సాధించారు. గాంధీతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలతోనూ టీఆర్‌ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. గాంధీ కూడా వెళ్లిపోతే గ్రేటర్ పరిధిలో టీడీపికి మాగంటి గోపినాథ్, వివేక్‌ గౌడ్, ప్రకాశ్‌ గౌడ్‌ మాత్రమే ఉంటారు.

First Published:  18 Dec 2015 4:17 AM GMT
Next Story