Telugu Global
Cinema & Entertainment

కొత్త కుర్రాళ్లపై కన్నేసిన ఫ్లాప్ దర్శకుడు

శ్రీనువైట్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఆగడు,బ్రూస్ లీ రూపంలో వరుసగా రెండు భారీ ఫ్లాపులు వచ్చేసరికి  కెరీర్ మళ్లీ మొదటికి వచ్చేసింది. స్టార్ హీరోలెవరూ ఈ దర్శకుడికి ఇప్పుడు ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా లేరు. ఈ నేపథ్యంలో…. యంగ్ స్టర్స్ పై దృష్టిపెట్టాడు శ్రీనువైట్ల. ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న ఎవరైనా ఒక కుర్రహీరోతో…. మాంఛి రొమాంటిక్ కమ్ కామెడీ ఎంటర్ టైనర్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాడు. ఒకప్పుడు తనకు ఇమేజ్ తెచ్చినపెట్టిన వెంకీ, […]

కొత్త కుర్రాళ్లపై కన్నేసిన ఫ్లాప్ దర్శకుడు
X
శ్రీనువైట్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. ఆగడు,బ్రూస్ లీ రూపంలో వరుసగా రెండు భారీ ఫ్లాపులు వచ్చేసరికి కెరీర్ మళ్లీ మొదటికి వచ్చేసింది. స్టార్ హీరోలెవరూ ఈ దర్శకుడికి ఇప్పుడు ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా లేరు. ఈ నేపథ్యంలో…. యంగ్ స్టర్స్ పై దృష్టిపెట్టాడు శ్రీనువైట్ల. ప్రస్తుతం డిమాండ్ లో ఉన్న ఎవరైనా ఒక కుర్రహీరోతో…. మాంఛి రొమాంటిక్ కమ్ కామెడీ ఎంటర్ టైనర్ తీస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాడు. ఒకప్పుడు తనకు ఇమేజ్ తెచ్చినపెట్టిన వెంకీ, ఢీ తరహా సినిమాల్నిఎన్నుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం వైట్ల దృష్టిలో నిఖిల్, రాజ్ తరుణ్, వరుణ్ తేజ ఉన్నారు. కుదిరితే వీళ్ల ముగ్గుల్లో ఒకరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు వైట్ల.
మొన్నటివరకు అఖిల్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ అఖిల్ మాత్రం బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత వైట్లకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఊహించని విధంగా అఖిల్ మూవీ కూడా ఫ్లాప్ అవ్వడంతో… మరోసారి అవకాశమిస్తాడేమోనని వైట్ల ఎదురుచూశాడు. కానీ అది సాధ్యంకాకపోవడంతో… ఇప్పుడు వరుణ్ తేజ, నిఖిల్, రాజ్ తరుణ్ లో ఒకరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.
First Published:  16 Dec 2015 7:03 PM GMT
Next Story