Telugu Global
Cinema & Entertainment

చిట్టి 2.0 ప్రారంభమైంది

టోటల్ సౌత్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబో సీక్వెల్ మొదలైంది. ఈ సీక్వెల్ ను చిత్రగణం ముద్దుగా చిట్టి 2.0 అని పిలుస్తోంది. రోబో సినిమాలో మరమనిషి పేరు చిట్టి. ఆ పేరునే కొనసాగిస్తూ…. చిట్టి 2.0 అని పిలుచుకుంటున్నారు. కానీ ఇది ఆధికారిక టైటిల్ కాదు. సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తారు. చెన్నైలోని ఈవీపీ థీమ్ పార్క్ లో ఏర్పాటుచేసిన భారీ సెట్ లో రోబో సీక్వెల్ షూటింగ్ షురూ అయింది. హీరో రజనీకాంత్, హీరోయిన్ […]

చిట్టి 2.0 ప్రారంభమైంది
X
టోటల్ సౌత్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబో సీక్వెల్ మొదలైంది. ఈ సీక్వెల్ ను చిత్రగణం ముద్దుగా చిట్టి 2.0 అని పిలుస్తోంది. రోబో సినిమాలో మరమనిషి పేరు చిట్టి. ఆ పేరునే కొనసాగిస్తూ…. చిట్టి 2.0 అని పిలుచుకుంటున్నారు. కానీ ఇది ఆధికారిక టైటిల్ కాదు. సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటిస్తారు. చెన్నైలోని ఈవీపీ థీమ్ పార్క్ లో ఏర్పాటుచేసిన భారీ సెట్ లో రోబో సీక్వెల్ షూటింగ్ షురూ అయింది. హీరో రజనీకాంత్, హీరోయిన్ అమీ జాక్సన్ మధ్య ఓ సాంగ్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినిమా మొదలైందనే విషయాన్ని దర్శకుడు శంకర్, రజనీ కూతురు, విక్రమసింహ దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ కన్ ఫర్మ్ చేశారు.
సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ మూవీపై కొన్ని అనుమానాలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్నాల్డ్ తప్పుకున్నాడనే విషయాన్ని టీం కన్ ఫర్మ్ చేసినప్పటికీ… మరో నటుడు ఎవరనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతోంది. మరోవైపు రోబో తరహాలోనే రోబో 2.0లో కూడా రజనీకాంతే…. విలన్ వేషం కూడా వేస్తారనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే సీక్వెల్ లో విలన్ ఎవరనే విషయాన్ని ప్రకటిస్తానంటున్నాడు దర్శకుడు శంకర్. భారతీయ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో (రూ.200కోట్లు) తెరకెక్కుతోంది రోబో-2.
First Published:  16 Dec 2015 7:04 PM GMT
Next Story