Telugu Global
Cinema & Entertainment

రోబో-2 విల‌న్ ఎవ‌రు?

రోబో-2 సినిమా ఇటీవ‌లే పట్టాలెక్కింది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.200 కోట్లు కావ‌డం విశేషం. ఇంత‌వ‌ర‌కూ భార‌త్‌లో నిర్మిత‌మైన ఏ సినిమాకు ఇంత భారీ పెట్టుబ‌డి పెట్ట‌లేదు. సినిమాలో విల‌న్ గా ఎంపిక చేసిన అర్నాల్డ్‌కే రూ.120 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డారు నిర్మాత‌లు. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కూ భారీగానే ముట్ట‌జెపుతున్నారు. అయితే, డేట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు నుంచి అర్నాల్డ్ స్వ‌యంగా త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం.  రోబో-2లో విల‌న్‌ది కీల‌క పాత్ర‌. మ‌రి అంత‌టి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో […]

రోబో-2 విల‌న్ ఎవ‌రు?
X
రోబో-2 సినిమా ఇటీవ‌లే పట్టాలెక్కింది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.200 కోట్లు కావ‌డం విశేషం. ఇంత‌వ‌ర‌కూ భార‌త్‌లో నిర్మిత‌మైన ఏ సినిమాకు ఇంత భారీ పెట్టుబ‌డి పెట్ట‌లేదు. సినిమాలో విల‌న్ గా ఎంపిక చేసిన అర్నాల్డ్‌కే రూ.120 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డారు నిర్మాత‌లు. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కూ భారీగానే ముట్ట‌జెపుతున్నారు. అయితే, డేట్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు నుంచి అర్నాల్డ్ స్వ‌యంగా త‌ప్పుకున్నాడ‌ని స‌మాచారం. రోబో-2లో విల‌న్‌ది కీల‌క పాత్ర‌. మ‌రి అంత‌టి ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో ఇప్పుడు ఎవ‌రు న‌టిస్తార‌న్న ఆస‌క్తి దేశ‌వ్యాప్తంగా నెల‌కొంది. ఇందుకోసం బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్‌, మ‌రో కుర్ర‌హీరో నీల్ నిఖిల్‌ను రోబో-2 నిర్మాత‌లు సంప్ర‌దిస్తున్నార‌ని తెలిసింది.
మొత్తానికి అర్నాల్డ్ ఉంటే హాలీవుడ్‌లోనూ విడుద‌ల చేసి వ‌సూళ్ల‌ను కొల్ల‌గొడుతామ‌నుకున్నారు. ఇప్పుడు ఆ అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఉత్తారాది అగ్ర‌తార‌ల‌పై ద‌ర్శ‌కుడు శంక‌ర్ దృష్టి పెట్టిన‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో హృతిక్ విల‌న్ గా చేసినా అభిమానుల‌కు పండ‌గే! అంత‌కుముందు హృతిక్ విల‌న్‌గా చేసిన ధూమ్‌-2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టిన సంగ‌తి తెలిసిందే! తాజాగా ధూమ్‌-4లోనూ హృతిక్కే విల‌న్‌! ఈ సినిమాలోనూ నటిస్తే.. విల‌న్‌గా హృతిక్ రోష‌న్‌కు ఇది మూడో సినిమా అవుతుంది.
Next Story