Telugu Global
Arts & Literature

వేలంలో ఆ చిత్రం ధ‌ర‌...ఓ విచిత్రం!

  భార‌త చిత్ర‌కారుడు వాసుదేవ్ ఎస్ గైటోండే గీసిన ఆయిల్‌ పెయింటింగ్ అంత‌ర్జాతీయ రికార్డుని సృష్టించింది. ముంబ‌యిలో అంత‌ర్జాతీయ వేలం సంస్థ క్రిస్టీ నిర్వ‌హించిన వేలంపాట‌లో ఇది 293 మిలియ‌న్ రూపాయ‌ల‌కు  అంటే 29 కోట్ల 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు (4.4 మిలియ‌న్ డాల‌ర్లు) అమ్ముడుపోయింది. లండ‌న్‌కి చెందిన క్రిస్టీ సంస్థ ముంబ‌యిలో ఈ వేలం నిర్వ‌హించింది. ఇండియ‌న్ ఆర్ట్ వ‌ర్క్‌లో ఇది స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు. ఈ సంవ‌త్స‌రం మొద‌ట్లో క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వ‌హించిన వేలంలో […]

వేలంలో ఆ చిత్రం ధ‌ర‌...ఓ విచిత్రం!
X

1627
వాసుదేవ్ ఎస్ గైటోండే

భార‌త చిత్ర‌కారుడు వాసుదేవ్ ఎస్ గైటోండే గీసిన ఆయిల్‌ పెయింటింగ్ అంత‌ర్జాతీయ రికార్డుని సృష్టించింది. ముంబ‌యిలో అంత‌ర్జాతీయ వేలం సంస్థ క్రిస్టీ నిర్వ‌హించిన వేలంపాట‌లో ఇది 293 మిలియ‌న్ రూపాయ‌ల‌కు అంటే 29 కోట్ల 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు (4.4 మిలియ‌న్ డాల‌ర్లు) అమ్ముడుపోయింది. లండ‌న్‌కి చెందిన క్రిస్టీ సంస్థ ముంబ‌యిలో ఈ వేలం నిర్వ‌హించింది. ఇండియ‌న్ ఆర్ట్ వ‌ర్క్‌లో ఇది స‌రికొత్త ప్ర‌పంచ రికార్డు. ఈ సంవ‌త్స‌రం మొద‌ట్లో క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వ‌హించిన వేలంలో అమ్ముడుపోయిన పెయింటింగ్ ఖ‌రీదు 4.1మిలియ‌న్ డాల‌ర్లు కాగా వాసుదేవ్ గైటోండే గీసిన అబ్‌స్ట్రాక్ట్ చిత్రం ఆ రికార్డుని అధిగ‌మించింది. 1995లో ఆయ‌న గీసిన ఈ చిత్రానికి పేరు లేదు. అంత‌ర్జాతీయ క‌ళారూపాల‌ను సేక‌రించే అల‌వాటు ఉన్న, పేరు వెల్ల‌డించ‌ని ఓ క‌ళాభిమాని దీన్ని కొనుగోలు చేశార‌ని క్రిస్టీ తెలిపింది. మ‌రే భార‌త చిత్ర‌కారుడి చిత్రానికి ఇంత ధ‌ర రాలేద‌ని క్రిస్టీ సంస్థ అంత‌ర్జాతీయ ప్ర‌తినిధి తెలిపారు.

121ఇంత‌కుముందుకూడా గైటోండే గీసిన చిత్రం క్రిస్టీ వేలంలో రికార్డుని సృష్టించింది.. 2013లో ఆ సంస్థ ఇండియాలో మొద‌టిసారిగా నిర్వ‌హించిన వేలంలో గైటోండే 1979లో గీసిన చిత్రం 237 మిలియ‌న్ల (23 కోట్ల 70 ల‌క్షలు)రూపాయల‌కు అమ్ముడుపోయింది. ఈ సెప్టెంబ‌రులో గోవా ఆర్టిస్టు పెయింటింగ్‌ అంత‌కుమించి ధ‌ర ప‌లికింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆ స్థానాన్ని గైటోండే పెయింటింగ్ ద‌క్కించుకుంది.

వాసుదేవ్ ఎస్ గైటోండే గురించి…
అబ్‌స్ట్రాక్ట్ చిత్రాల చిత్ర‌కారుడిగా పేరు తెచ్చుకున్న గైటోండే, 1924లో మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించారు. స‌ర్ జె జె స్కూల్ ఆఫ్‌ ఆర్ట్ నుండి డిప్లొమా పొందారు. 1950లో బాంబే ప్రోగ్ర‌సివ్ ఆర్టిస్ట్స్ గ్రూపులో చేరారు. 1971లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్నారు. దేశ‌వ్యాప్తంగానే కాక విదేశాల్లోనూ త‌న చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. ఎన్నో బ‌హుమ‌తులు పొందారు. త‌న చిత్రాల‌ను అంద‌రూ అబ్‌స్ట్రాక్ట్ అనీ, సంక్లిష్ట‌మ‌ని అంటున్నా, గైటోండే అందుకు అంగీక‌రించేవారు కాదు. అందులో మ‌ర్మ‌మేమీ లేద‌ని, కాక‌పోతే త‌న చిత్రాల‌కు ఒక వ‌స్తువు అంటూ ఉండ‌ద‌ని, వాటిని చిత్ర‌క‌ళ‌కు ఒక లిపిగా భావించ‌వ‌చ్చ‌ని అనేవారు. ప్రాచీన భాషా లిపి, జెన్ త‌త్వం ఈ రెండింటి మేళ‌వింపుగా, ఒక నిశ్శ‌బ్ద సందేశాన్ని ఇస్తున్న‌ట్టుగా గైంటోడే చిత్రాలు ఉంటాయ‌నేది విమ‌ర్శ‌కుల విశ్లేష‌ణ‌. ఆలోచ‌న‌లు, ఆలోచ‌న‌ల‌కంటే నిగూఢ‌మైన అంత‌శ్చేత‌న‌ను గైటోండే చిత్రాల్లో, ఆయ‌న వాడే రంగుల్లో, గీత‌ల అల్లిక‌లో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. భార‌త చిత్ర‌క‌ళ‌కు అంత‌ర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఈ ప్ర‌తిభాశాలి 2001లో మరణించారు.

First Published:  16 Dec 2015 4:32 AM GMT
Next Story