Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్‌కు కృష్ణ కుటుంబం

  సూప‌ర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం త‌న ప‌రిధిని విస్త‌రించే ప‌నిలో ప‌డిన‌ట్లుంది. ఇప్ప‌టికే ప్రిన్స్ మ‌హేశ్ బాబు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు-త‌మిళంలో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. త‌రువాత మ‌హేశ్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేశ్ ముంబైలో ఇటీవ‌ల ఇల్లు కొనుగోలు చేయ‌డం విశేషం. ముంబైలో షూటింగ్‌లున్న‌పుడు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే మ‌హేశ్ ఇల్లు కొన్నాడని స‌మాచారం. కృష్ణ అల్లుడు, మ‌హేశ్ బాబు బావ అయిన సుధీర్ బాబు బాలీవుడ్‌లో ఓ సినిమాకు ఏకంగా సైన్ […]

బాలీవుడ్‌కు కృష్ణ కుటుంబం
X
సూప‌ర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం త‌న ప‌రిధిని విస్త‌రించే ప‌నిలో ప‌డిన‌ట్లుంది. ఇప్ప‌టికే ప్రిన్స్ మ‌హేశ్ బాబు మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు-త‌మిళంలో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. త‌రువాత మ‌హేశ్ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేశ్ ముంబైలో ఇటీవ‌ల ఇల్లు కొనుగోలు చేయ‌డం విశేషం. ముంబైలో షూటింగ్‌లున్న‌పుడు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌నే మ‌హేశ్ ఇల్లు కొన్నాడని స‌మాచారం. కృష్ణ అల్లుడు, మ‌హేశ్ బాబు బావ అయిన సుధీర్ బాబు బాలీవుడ్‌లో ఓ సినిమాకు ఏకంగా సైన్ చేసేశాడు. అయితే, హీరోగా కాదు విల‌న్‌గా! పాత‌త‌రం హీరో జాకీ ష్రాఫ్ (పంజా, అస్త్రం సినిమాల్లో విల‌న్‌) కుమారుడు టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా న‌టిస్తున్న భాగీ సినిమాలో సుధీర్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. కృష్ణ కోడ‌లు నమ్ర‌త శిరోద్క‌ర్ బాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి అగ్ర‌హీరోయిన్‌! ఇప్పుడు మ‌హేశ్‌, సుధీర్‌లు బాలీవుడ్‌లో త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌టం సూప‌ర్ కృష్ణ కుటుంబం అభిమానుల‌కు మ‌రింత ఆనందాన్నిచ్చే విష‌యం. మొత్తానికి కొన్నేళ్లుగా ద‌క్షిణాది నుంచి బాలీవుడ్‌కు ఎగుమ‌త‌వుతోన్న హీరోల సంఖ్య పెరుగుతుండ‌టం శుభ‌సూచ‌కం!
Next Story