Telugu Global
Cinema & Entertainment

ధ‌ర్మేంద్ర మ‌న‌వ‌ళ్లు హీరోల‌వుతున్నారు!

మ‌రే ఇత‌ర రంగాల్లో లేనంత‌గా వార‌స‌త్వ పోక‌డ‌లు సినీరంగంలో క‌న‌బ‌డ‌తాయి. బాలివుడ్ మొన్న‌టిత‌రం హీరో ధ‌ర్మేంద్ర మ‌న‌వ‌ళ్లు, నిన్న‌టిత‌రం హీరో స‌న్నిడియోల్ కుమారులు అయిన క‌ర‌ణ్‌, రాజ్‌వీర్లు నేటిత‌రం హీరోలుగా తెరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న పెద్ద కొడుకు క‌ర‌ణ్ డియోల్‌ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్టుగా ఇప్ప‌టికే స‌న్నీ చాలాసార్లు చెప్పాడు. వ‌చ్చే సంవ‌త్స‌రం 24వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్న క‌ర‌ణ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ, త‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని  స‌న్నిడియోల్ తాజాగా ప్ర‌క‌టించాడు. క‌ర‌ణ్‌ని లాంచ్ చేయ‌డం […]

ధ‌ర్మేంద్ర మ‌న‌వ‌ళ్లు హీరోల‌వుతున్నారు!
X

మ‌రే ఇత‌ర రంగాల్లో లేనంత‌గా వార‌స‌త్వ పోక‌డ‌లు సినీరంగంలో క‌న‌బ‌డ‌తాయి. బాలివుడ్ మొన్న‌టిత‌రం హీరో ధ‌ర్మేంద్ర మ‌న‌వ‌ళ్లు, నిన్న‌టిత‌రం హీరో స‌న్నిడియోల్ కుమారులు అయిన క‌ర‌ణ్‌, రాజ్‌వీర్లు నేటిత‌రం హీరోలుగా తెరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న పెద్ద కొడుకు క‌ర‌ణ్ డియోల్‌ని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్టుగా ఇప్ప‌టికే స‌న్నీ చాలాసార్లు చెప్పాడు. వ‌చ్చే సంవ‌త్స‌రం 24వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్న క‌ర‌ణ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ, త‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని స‌న్నిడియోల్ తాజాగా ప్ర‌క‌టించాడు. క‌ర‌ణ్‌ని లాంచ్ చేయ‌డం అయ్యాక రాజ్‌వీర్ మీద దృష్టి పెడ‌తాన‌ని కూడా చెప్పాడు. తాను ఒక ప్ర‌ముఖ హీరో కుమారుడు కావ‌డం అనేది త‌న‌కు ప్ల‌స్ అయ్యిందా, మైన‌స్ అయ్యిందా అని అడిగిన‌ప్పుడు, స‌న్నీ, తానెప్పుడూ ఆ కోణంలో త‌న‌నుతాను చూసుకోలేద‌న్నాడు. అలా ఆలోచిస్తే ప‌నే చేయ‌లేమ‌ని, ఇక్క‌డ సెల‌బ్రిటీల పిల్ల‌లే కాదు, ఇత‌ర రంగాల‌వాళ్లూ ఉన్నార‌ని స‌మాధానం ఇచ్చాడు. రాజ‌కీయాల గురించి మాట్లాడుతూ, త‌న తండ్రి రాజ‌కీయాల్లోకి వెళ్లిన‌ప్పుడు త‌న‌కు అంత‌గా అవ‌గాహ‌న లేద‌ని, ఇప్ప‌టికీ త‌న‌కు రాజ‌కీయాల్లోకి వెళ్లే ఉద్దేశ‌మే లేదని స‌న్నిడియోల్ తెలిపాడు.

Next Story