Telugu Global
Cinema & Entertainment

ప‌వ‌న్‌పై మ‌న‌సు ప‌డ్డ అనుష్క‌

మ‌రోలా అనుకోకండి..! విష‌యమేంటంటే.. అనుష్క ఇండ‌స్ర్టీకి వ‌చ్చి అప్పుడే 10 ఏళ్లు దాటిపోయాయి. అయినా ఇంత‌వ‌ర‌కు ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా చాన్స్ రాలేదు. అనుష్క తెలుగు, తమిళ అగ్ర‌ హీరోలంద‌రి స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించింది. కెరీర్ ఆరంభంలోనే స్టాలిన్‌లో మెగాస్టార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. ఆ త‌రువాత మెగా కాంపౌండ్‌కే చెందిన బ‌న్నీతో గ‌మ్యంలో క‌లిసి న‌టించింది. అయితే, ప‌వ‌న్‌తో న‌టించాల‌న్న కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింద‌ని వాపోతోంద‌ట ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం సింగం-3, […]

ప‌వ‌న్‌పై మ‌న‌సు ప‌డ్డ అనుష్క‌
X
మ‌రోలా అనుకోకండి..! విష‌యమేంటంటే.. అనుష్క ఇండ‌స్ర్టీకి వ‌చ్చి అప్పుడే 10 ఏళ్లు దాటిపోయాయి. అయినా ఇంత‌వ‌ర‌కు ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్‌గా చాన్స్ రాలేదు. అనుష్క తెలుగు, తమిళ అగ్ర‌ హీరోలంద‌రి స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించింది. కెరీర్ ఆరంభంలోనే స్టాలిన్‌లో మెగాస్టార్ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. ఆ త‌రువాత మెగా కాంపౌండ్‌కే చెందిన బ‌న్నీతో గ‌మ్యంలో క‌లిసి న‌టించింది. అయితే, ప‌వ‌న్‌తో న‌టించాల‌న్న కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింద‌ని వాపోతోంద‌ట ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం సింగం-3, బాహుబ‌లి-2 సినిమాల్లో అనుష్క బిజీగా ఉంది. మ‌రోవైపు ప‌వ‌న్ కూడా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్రాజెక్టులో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు.
ప‌వ‌న్ తో వ‌చ్చే కిక్కే వేర‌ప్పా!
అనుష్క కెరీర్ గ్రాఫ్ ఎన్నడూ డౌన్‌ఫాల్ కాక‌పోవ‌డం విశేషం. ఈ ప‌దేళ్ల‌లో అనేక ఫ్లాపులు ఎదురైనా అనుష్క‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కొంద‌రు హీరోలు అనుష్క బాగా ఎత్తుగా ఉన్నా స‌రే.. ఆమెతో చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే అనుష్కే చేయాల‌న్న ముద్ర ప‌డిపోయింది. పైగా తెలుగు, త‌మిళ యువ‌త అనుష్కను ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే నిర్మాత‌లు స్వీటీ ఉంటే మినిమం గ్యారంటీ అనుకుంటారు. అనుష్క త‌న కెరీర్‌లో ద‌క్షిణాదికి చెందిన చిరంజీవి, రజినీకాంత్‌, సూర్య, నాగార్జున‌, వెంక‌టేశ్ త‌దిత‌ర అగ్ర హీరోలంద‌రితోనూ క‌లిసి ప‌నిచేసింది. ఎంద‌రితో చేసినా.. ప‌వ‌న్ స‌ర‌స‌న చేస్తే.. వ‌చ్చే కిక్కే వేర‌ప్పా! అంటూ స్నేహితుల‌తో చెబుతోంద‌ట‌. పాపం స్వీటీ కోరిక ఎప్ప‌టికి నెర‌వేరుతుందో?
Next Story