Telugu Global
Others

కాల్ మనీ- సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ జెడ్పీ చైర్మన్!

విజయవాడలో బయటపడ్డ కాల్ మనీ సెక్స్ రాకెట్ లింక్‌లు పక్క జిల్లాల్లోనూ బయడపడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆయన కాల్ మనీలో కోటిరూపాయలు పెట్టుబడిపెట్టినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాల్ మనీలో కీలక నిందితుడిగా మున్న పెండ్యాల శ్రీకాంత్ ద్వారా ఈ డబ్బు పెట్టించినట్టు తెలుస్తోంది.  శ్రీకాంత్, ముళ్లపూడి బాపిరాజులు ఇద్దరూ ఒకప్పుడు క్లాస్ మేట్స్‌. బాపిరాజు జెడ్పీచైర్మన్ అయిన తర్వాత అతడి ఆర్ధిక లావాదేవీలన్నీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. వీరిద్దరు గతంలో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా […]

కాల్ మనీ- సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ జెడ్పీ చైర్మన్!
X

విజయవాడలో బయటపడ్డ కాల్ మనీ సెక్స్ రాకెట్ లింక్‌లు పక్క జిల్లాల్లోనూ బయడపడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆయన కాల్ మనీలో కోటిరూపాయలు పెట్టుబడిపెట్టినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాల్ మనీలో కీలక నిందితుడిగా మున్న పెండ్యాల శ్రీకాంత్ ద్వారా ఈ డబ్బు పెట్టించినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్, ముళ్లపూడి బాపిరాజులు ఇద్దరూ ఒకప్పుడు క్లాస్ మేట్స్‌. బాపిరాజు జెడ్పీచైర్మన్ అయిన తర్వాత అతడి ఆర్ధిక లావాదేవీలన్నీ శ్రీకాంత్ పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. వీరిద్దరు గతంలో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు.

మరోవైపు విజయవాడ టీడీపీ కార్పొరేటర్ కనకదుర్గ, ఆమె భర్త కొండలను కాల్ మనీ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా చెక్కులు,ప్రామసరీ నోట్లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేశారు.

First Published:  15 Dec 2015 1:26 AM GMT
Next Story