Telugu Global
Cinema & Entertainment

లోఫ‌ర్ తో  మాస్ ఇమెజ్ టార్గెట్

మెగా హీరోల్లో  అంద‌రు స్టార్సే గానీ.. మంచి న‌టుడు  ఇప్ప‌టి యంగ్  స్టార్స్ లో ఎవ‌రు లేరంటారు.  క‌మ‌ర్షియ‌ల్  ఫార్మెట్స్ ను న‌డిపించ గ‌ల‌రే గానీ..  క‌థా బ‌లం  చిత్రాలు చేయాలంటే  వాళ్ల‌తో న‌డ‌వ‌డం క‌ష్ట‌మే .  అయితే   నాగ‌బాబు త‌న‌యుడు   వ‌రుణ్ తేజ్ మాత్రం   గొప్ప న‌టుడు అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని   నిరిపించుకున్నాడు. మొద‌టి చిత్రం నుంచే   క‌థా బ‌లం వున్న చిత్రాల‌కే పెద్ద పీట వేస్తుండ‌టం   విశేషం.   ఇక ఈ మ‌ధ్య  క్రిష్ […]

లోఫ‌ర్ తో  మాస్ ఇమెజ్ టార్గెట్
X

మెగా హీరోల్లో అంద‌రు స్టార్సే గానీ.. మంచి న‌టుడు ఇప్ప‌టి యంగ్ స్టార్స్ లో ఎవ‌రు లేరంటారు. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మెట్స్ ను న‌డిపించ గ‌ల‌రే గానీ.. క‌థా బ‌లం చిత్రాలు చేయాలంటే వాళ్ల‌తో న‌డ‌వ‌డం క‌ష్ట‌మే . అయితే నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ మాత్రం గొప్ప న‌టుడు అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని నిరిపించుకున్నాడు. మొద‌టి చిత్రం నుంచే క‌థా బ‌లం వున్న చిత్రాల‌కే పెద్ద పీట వేస్తుండ‌టం విశేషం.

ఇక ఈ మ‌ధ్య క్రిష్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన కంచె చిత్రం తో త‌ను సాధార‌ణ న‌టుడు కాద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. కేవ‌లం స్టార్ డ‌మ్ గెయిన్ చేయ‌డం త‌న ల‌క్ష్యం కాదు. న‌టుడిగా ప‌ది కాలల పాటు ఆడియ‌న్స్ ను అల‌రించ‌డ‌మే ధ్యేయ‌మ‌ని చాటాడు. అయితే ప్ర‌స్తుత మార్కెట్ ట్రెండ్ లో కొంత క‌మ‌ర్షియ‌ల్ బేస్ కూడా అవ‌స‌రం. అందుకే వ‌రుణ్ అటువంటి చిత్రాలు చేసే పూరీ జ‌గ‌న్నాధ్ తో జ‌త క‌ట్టాడు. ఈ సినిమా ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే అంచ‌నాలు పెంచాయి. అమ్మ నాన్న ఓ త‌మిళమ్మాయి చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ మ‌ద‌ర్ సెంటిమెంట్ కు పెద్ద పీట వేస్తూ చేస్తున్న చిత్రం. మ‌రి గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న లోఫ‌ర్ తో వ‌రుణ్ సందేశ్ మాస్ ఆడియ‌న్స్ కు మ‌రింత చేరువ అవుతాడా..?

First Published:  14 Dec 2015 7:10 PM GMT
Next Story