Telugu Global
Cinema & Entertainment

చిరు కాదన్న చెర్రి ఒకే అనేసాడు

ఆటోజానీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. పూరి జగన్నాధ్ రాసుకున్న ఈ స్టోరీ మెగాస్టార్ కు నచ్చలేదు. అప్పట్లో ఆ వివాదం కొన్ని రోజులు  నడిచింది. ఇదంతా మనందరికీ తెలిసిన కథ. తాజాగా ఈ కథకు కొనసాగింపును కూడా తెలుగుగ్లోబల్.కామ్ మీకు అందించింది. అప్పట్లో కత్తులు దూసుకున్న పూరీ-చిరు…. తాజాగా పూరి జగన్నాధ్ వ్యాఖ్యలతో మళ్లీ కలిసిపోయినట్టే కనిపించారు. ఈ విషయాన్ని తాజాగా మీకు అందించాం. ఇప్పుడు దీనికి తాజా తాజాగా మరో వార్త మీకు అందిస్తున్నాం. ఆటోజానీ చిరంజీవి […]

చిరు కాదన్న చెర్రి ఒకే అనేసాడు
X
ఆటోజానీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. పూరి జగన్నాధ్ రాసుకున్న ఈ స్టోరీ మెగాస్టార్ కు నచ్చలేదు. అప్పట్లో ఆ వివాదం కొన్ని రోజులు నడిచింది. ఇదంతా మనందరికీ తెలిసిన కథ. తాజాగా ఈ కథకు కొనసాగింపును కూడా తెలుగుగ్లోబల్.కామ్ మీకు అందించింది. అప్పట్లో కత్తులు దూసుకున్న పూరీ-చిరు…. తాజాగా పూరి జగన్నాధ్ వ్యాఖ్యలతో మళ్లీ కలిసిపోయినట్టే కనిపించారు. ఈ విషయాన్ని తాజాగా మీకు అందించాం. ఇప్పుడు దీనికి తాజా తాజాగా మరో వార్త మీకు అందిస్తున్నాం. ఆటోజానీ చిరంజీవి చేయి దాటిపోయినా… మెగాకాంపౌండ్ మాత్రం దాటిపోలేదు. అవును… చిరంజీవి చేయాల్సిన ఆటోజానీ పాత్రలో అతడి ముద్దుల తనయుడు రామ్ చరణ్ ఒదిగిపోయేందుకు పావులు చకచకా కదులుతున్నాయి.
చిరంజీవి… ఆటోజానీ కథ చేయడనే విషయం ఎప్పుడో కన్ ఫర్మ్ అయిపోయింది. తమిళ కత్తి సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నప్పుడే ఆ విషయం పసివాడికి కూడా అర్థమైపోయింది. అయితే పూరి జగన్నాధ్ అనుకోకుండా మెగాస్టార్ పై ప్రసంశల జల్లు కురిపించినప్పుడు మాత్రం ఆటోజానీపై అనుమానాలు తలెత్తాయి ఆ అనుమానాలకు మరింత ఊతమిస్తూ… చిరుత కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆటోజానీ కథను రామ్ చరణ్ తో తీయాల్సిందిగా…. పూరీకి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
చెర్రీని వెండితెరకు పరిచయం చేసిన ఘనత పూరి జగన్నాధ్ దే. మళ్లీ వాళ్లిద్దరి కాంబినేషన్ లో ఇన్నాళ్లకు మరో సినిమా సెట్ అయింది. ప్రస్తుతం మెగాకాంపౌండ్ లోనే చక్కర్లు కొడుతున్న ఈ వేడి వార్త… త్వరలోనే కాంపౌండ్ దాటి ప్రేక్షకుల చెవిన పడనుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ…
First Published:  14 Dec 2015 5:04 PM GMT
Next Story