Telugu Global
Cinema & Entertainment

మెగా మంత్రాంగం ఫలించిన వేళ

వ్యక్తుల్ని డీల్ చేయడం కూడా ఓ కళ. తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని, వర్గాన్ని దగ్గరకు తీసుకోవడం అందరికీ చేతకాదు. ఈ విషయంలో మెగాకాంపౌండ్ ఆరితేరిపోయింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఈ విద్యకు ఆదిగురువు. గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్న ఎంతోమంది సినీప్రముఖుల్ని తిరిగి తనవాళ్లుగా మార్చుకొని అందరివాడు అయిపోయాడు చిరంజీవి. ఇప్పుడీ లిస్ట్ లోకి పూరి జగన్నాధ్ కూడా చేరిపోయాడు. చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి మొన్నటివరకు చిరుపై బహిరంగానే విమర్శలు చేసిన పూరి, ఇప్పుడు […]

మెగా మంత్రాంగం ఫలించిన వేళ
X
వ్యక్తుల్ని డీల్ చేయడం కూడా ఓ కళ. తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని, వర్గాన్ని దగ్గరకు తీసుకోవడం అందరికీ చేతకాదు. ఈ విషయంలో మెగాకాంపౌండ్ ఆరితేరిపోయింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఈ విద్యకు ఆదిగురువు. గతంలో తనకు వ్యతిరేకంగా ఉన్న ఎంతోమంది సినీప్రముఖుల్ని తిరిగి తనవాళ్లుగా మార్చుకొని అందరివాడు అయిపోయాడు చిరంజీవి. ఇప్పుడీ లిస్ట్ లోకి పూరి జగన్నాధ్ కూడా చేరిపోయాడు. చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి మొన్నటివరకు చిరుపై బహిరంగానే విమర్శలు చేసిన పూరి, ఇప్పుడు కామ్ అయిపోయాడు. కుదిరితే చిరు సినిమాను డైరక్ట్ చేస్తానంటూ మళ్లీ రాగం అందుకున్నాడు.
లోఫర్ సినిమా విడుదలకు సిద్ధమౌతున్న ఈ తరుణంలో… చిరు 150వ సినిమాను మరోసారి తెరపైకి తెచ్చాడు జగన్.అప్పట్లో మీడియా తన వ్యాఖ్యలని తప్పుగా రాసిందన్నాడు. 150వ సినిమా కోసం తను రాసిన సెకెండాఫ్ స్క్రిప్ట్ నచ్చలేదనే విషయం చిరంజీవి స్వయంగా తనతోనే చెప్పారంటున్నాడు పూరి జగన్. అప్పట్లో మాత్రం స్క్రిప్ట్ నచ్చలేదనే విషయాన్ని చిరంజీవి తనకు తప్ప అందరికీ చెప్పాడని విమర్శించాడు. ఇప్పుడు ఇలా మాట మార్చాడు. చిరు అవకాశమిస్తే… తన 150వ సినిమా కోసం ఎన్నికథలైనా రాస్తానంటున్నాడు. జగన్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే… మళ్లీ చిరంజీవి కథ రాయమని పురమాయించినట్టు కనిపిస్తోంది.
First Published:  13 Dec 2015 5:00 PM GMT
Next Story