Telugu Global
Cinema & Entertainment

ముద్దంటే చేదా..! నీకా ఉద్దేశం లేదా..

ముద్దంటే చేదా..! నీకా ఉద్దేశం లేదా.. అంటే అవున‌నే అంటున్నాడు ప్రిన్స్ మ‌హేశ్ బాబు. తెరంగ్రేట్రంతోనే బోలెడంత మంది అమ్మాయిల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టిన ఈ ట‌క్క‌రి దొంగ ఇప్పుడు తీరు మార్చుకున్నాడు. ఇక‌పై ముద్దు స‌న్నివేశాలు- లిప్ లాక్‌లు వ‌ద్ద‌ని ద‌ర్శ‌కులకు చెబుతున్నాడ‌ట‌. అత‌డులో త్రిష‌తో, బిజినెస్ మాన్‌లో కాజ‌ల్‌తో, దూకుడులో స‌మంత‌తో ముద్దు స‌న్నివేశాలు ఇర‌గ‌దీశాడు మ‌హేశ్‌. ఇద్ద‌రి పిల్ల‌ల‌కు తండ్రి అయిన‌ప్ప‌టికీ మ‌హేశ్ మీద అభిమానం ఏమాత్రం త‌గ్గ‌లేదు అమ్మాయిల‌కి. అత‌డు మ‌రిన్ని రొమాంటిక్ […]

ముద్దంటే చేదా..! నీకా ఉద్దేశం లేదా..
X

ముద్దంటే చేదా..! నీకా ఉద్దేశం లేదా.. అంటే అవున‌నే అంటున్నాడు ప్రిన్స్ మ‌హేశ్ బాబు. తెరంగ్రేట్రంతోనే బోలెడంత మంది అమ్మాయిల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టిన ఈ ట‌క్క‌రి దొంగ ఇప్పుడు తీరు మార్చుకున్నాడు. ఇక‌పై ముద్దు స‌న్నివేశాలు- లిప్ లాక్‌లు వ‌ద్ద‌ని ద‌ర్శ‌కులకు చెబుతున్నాడ‌ట‌. అత‌డులో త్రిష‌తో, బిజినెస్ మాన్‌లో కాజ‌ల్‌తో, దూకుడులో స‌మంత‌తో ముద్దు స‌న్నివేశాలు ఇర‌గ‌దీశాడు మ‌హేశ్‌. ఇద్ద‌రి పిల్ల‌ల‌కు తండ్రి అయిన‌ప్ప‌టికీ మ‌హేశ్ మీద అభిమానం ఏమాత్రం త‌గ్గ‌లేదు అమ్మాయిల‌కి. అత‌డు మ‌రిన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు చేయాల‌ని వారంతా కోరుకోవ‌డం విశేషం!

తండ్రిగా ఆలోచిస్తున్నాడు!
అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు అయిన ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇప్పుడు మాత్రం ముద్దంటే వ‌ద్దంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు తేల్చేస్తున్నాయి. తాజాగా మ‌హేశ్ న‌టిస్తున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వంలో ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నాడ‌ట‌. అయితే, ఓ సంద‌ర్భంలో లిప్‌లాక్ సీన్ ఉంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్‌ అడ్డాల చెప్ప‌గానే సున్నితంగా తిర‌స్క‌రించాడ‌ట ఈ బిజినెస్ మ్యాన్‌. ఇంత‌కుముందు ప‌రిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అని, త‌న సినిమాను త‌న కుమారుడు గౌతం, కుమార్తె సితార‌లతో క‌లిసి చూస్తున్నాన‌ని.. ఇలాంటి స‌న్నివేశాలు వారికి ఇబ్బంది క‌లిగిస్తాయ‌ని చెప్పాడ‌ట‌. త‌న‌కు మునుముందు ఇలాంటి స‌న్నివేశాలు రాయ‌వ‌ద్ద‌ని కూడా స్ప‌ష్టం చేశాడ‌ట‌. పాపం! ముద్దు సీన్ల‌కోసం ఎదురు చూస్తున్న యువ‌త ఆశ‌ల‌పై త‌మ హీరోనే నీళ్లు చ‌ల్డడం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట!

First Published:  13 Dec 2015 7:05 PM GMT
Next Story