Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ తప్పు చేస్తున్నాడా ?

తను ఏ విషయంలో తప్పు చేస్తున్నాననే విషయం రామ్ చరణ్ కు బాగా తెలుసు. అందుకే విలక్షణంగా కనిపించేదుకు కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. తనకున్న ఇమేజ్ కు, ఇంకాస్త కొత్తదనం జోడిస్తే కచ్చితంగా హిట్టు కొట్టొచ్చనే సీక్రెట్ చెర్రీకి తెలిసిపోయింది. అందుకే….. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఇలా అన్నీ తెలిసిన చెర్రీ… చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా అనిపిస్తుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాకు నో చెప్పాడనే […]

రామ్ చరణ్ తప్పు చేస్తున్నాడా ?
X
తను ఏ విషయంలో తప్పు చేస్తున్నాననే విషయం రామ్ చరణ్ కు బాగా తెలుసు. అందుకే విలక్షణంగా కనిపించేదుకు కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. తనకున్న ఇమేజ్ కు, ఇంకాస్త కొత్తదనం జోడిస్తే కచ్చితంగా హిట్టు కొట్టొచ్చనే సీక్రెట్ చెర్రీకి తెలిసిపోయింది. అందుకే….. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఇలా అన్నీ తెలిసిన చెర్రీ… చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా అనిపిస్తుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాకు నో చెప్పాడనే టాక్ రావడంతో అంతా ఇలా ఫీలవుతున్నారు.
అవును… గౌతమ్ మీనన్ సినిమాలు ఎలా ఉంటాయో… మరీ ముఖ్యంగా అందులో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. కచ్చితంగా హీరో కొత్తగా కనిపిస్తాడు. అప్పటివరకు ఆ హీరోను అలాంటి కోణంలో మనం చూడం.అలాంటి దర్శకుడితో సినిమా చేయడం, ఇప్పుడు చెర్రీ లాంటి యంగ్ హీరోకు చాలా అవసరం. గౌతమ్ మీనన్ కూడా చెర్రీ కోసం కొన్ని కథలు రాసుకొని, మెగా కాంపౌండ్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం…. గౌతమ్ మీనన్ కు చెర్రీ నో చెప్పాడనే టాక్ నడుస్తోంది. దీంతో అంతా చెర్రీనే నిందిస్తూ విమర్శలు చేస్తున్నారు.
Next Story