Telugu Global
Cinema & Entertainment

దేవిని చూసి ప‌వ‌న్ పారిపోతున్నాడా?

 యువ సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ స్టైలే వేరు! అత‌ను సంగీతం అందించిన సినిమాల‌న్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్టే! హీరోలు, హీరోయిన్ల‌తో పాట‌లు పాడించ‌డంలో దేవీ దిట్ట‌! ఇంత‌క‌ముందు అత్తారింటికి దారేది? సినిమాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో కాట‌మ రాయుడా.. క‌దిరి న‌ర‌సింహుడా.. పాట పాడించి తెలుగు ప్రేక్ష‌కులను ఉర్రూత‌లూగించాడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌లో మ‌రోసారి వీరి కాంబినేష‌న్ రీపిటైంది. అయితే, ఈ సినిమాలోనూ ప‌వ‌న్ తో ఓ పాట పాడించాల‌ని దేవీ కోరాడ‌ట‌. త‌న‌కు ఆస‌క్తి […]

దేవిని చూసి ప‌వ‌న్ పారిపోతున్నాడా?
X
యువ సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ స్టైలే వేరు! అత‌ను సంగీతం అందించిన సినిమాల‌న్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్టే! హీరోలు, హీరోయిన్ల‌తో పాట‌లు పాడించ‌డంలో దేవీ దిట్ట‌! ఇంత‌క‌ముందు అత్తారింటికి దారేది? సినిమాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో కాట‌మ రాయుడా.. క‌దిరి న‌ర‌సింహుడా.. పాట పాడించి తెలుగు ప్రేక్ష‌కులను ఉర్రూత‌లూగించాడు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌లో మ‌రోసారి వీరి కాంబినేష‌న్ రీపిటైంది. అయితే, ఈ సినిమాలోనూ ప‌వ‌న్ తో ఓ పాట పాడించాల‌ని దేవీ కోరాడ‌ట‌. త‌న‌కు ఆస‌క్తి లేద‌ని ప‌వ‌న్ తేల్చిచెప్పాడ‌ట‌. దేవీ ఈ విష‌యాన్ని అంత‌టితో వ‌ద‌ల్లేద‌ని టాక్‌! ప‌వ‌న్ ఎక్క‌డ షూటింగ్ చేస్తుంటే అక్క‌డికి వెళ్లి మ‌రీ ఒప్పించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని తెలిసింది. దీంతో ఒక ద‌శ‌లో దేవీ వ‌స్తున్నాడ‌ని తెలిస్తే ప‌వ‌న్ పారిపోయినంత ప‌నిచేశాడంట‌.
మేకింగ్ వీడియో వ‌ద్దా?
దేవీ ఇక వ‌ద‌ల‌డ‌ని ఫిక్స్ అయిన ప‌వ‌న్ పాట పాడేందుకు ఒప్పుకున్నాడ‌ని తెలిసింది. అయితే, ఇందుకు ఓ కండిష‌న్ పెట్టాడ‌ట‌. తాను పాడుతున్న‌పుడు ఎలాంటి మేకింగ్ వీడియోలు తీయ‌వ‌ద్ద‌ని చెప్పేశాడ‌ట‌. క‌నీసం ఇందుకైనా ఒప్పుకున్నంద‌కు థ్యాంక్స్ అని సంతోషించాడ‌ట దేవీ. అయితే, పాట‌కు ఒప్పించినోడు మేకింగ్ వీడియోకు ఒప్పించ‌లేడా? అని చిత్ర యూనిట్ గుస‌గుస‌లు పెట్టుకుంటుంది. కాట‌మ రాయుడా పాట‌కు యూట్యూబ్‌లో ల‌క్ష‌ల హిట్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే! దీంతో అంత‌కు మించిన హిట్ చేసేందుకు దేవీ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడ‌ని స‌మాచారం.
First Published:  13 Dec 2015 7:07 PM GMT
Next Story