Telugu Global
Cinema & Entertainment

నయనతార ఒప్పుకోలేదు కాబట్టే !

బాలకృష్ణ తాజా చిత్రం డిక్టేటర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలాంటి టైమ్ లో కూడా ఈ సినిమాపై రూమర్లు ఆగడం లేదు. బాలయ్య బాబుకు బాగా కలిసొచ్చిన నయనతారను ఈ సినిమాలో కూడా తీసుకున్నారని ప్రచారం మొదలైంది. డిక్టేటర్ లో బాలయ్య సరసన నయనతార ఓ ఐటెంసాంగ్ కూడా చేస్తోందని పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ వార్తలన్నింటినీ దర్శకుడు శ్రీవాస్ ఖండించాడు. తమ సినిమాకు, […]

నయనతార ఒప్పుకోలేదు కాబట్టే !
X
బాలకృష్ణ తాజా చిత్రం డిక్టేటర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇలాంటి టైమ్ లో కూడా ఈ సినిమాపై రూమర్లు ఆగడం లేదు. బాలయ్య బాబుకు బాగా కలిసొచ్చిన నయనతారను ఈ సినిమాలో కూడా తీసుకున్నారని ప్రచారం మొదలైంది. డిక్టేటర్ లో బాలయ్య సరసన నయనతార ఓ ఐటెంసాంగ్ కూడా చేస్తోందని పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ వార్తలన్నింటినీ దర్శకుడు శ్రీవాస్ ఖండించాడు. తమ సినిమాకు, నయనతారకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు. డిక్టేటర్ సినిమాలో ఐటెంసాంగ్ కోసం మొదట నయనతారను తీసుకుందామని అనుకున్న మాట నిజమే కానీ…. ఆ స్థానంలో శ్రద్ధాదాస్ ను తీసుకున్నామని స్పష్టంచేశాడు. ఐటెంసాంగ్ చేసేందుకు నయనతార అంగీకరించలేదని… కాబట్టే ఆ స్థానంలో శ్రద్ధాదాస్ ను పెట్టి ఐటెంసాంగ్ పూర్తిచేశామని శ్రీవాస్ ప్రకటించాడు. అలా.. .సింహా కాంబినేషన్ మరోసారి తెరపైకి రాకుండా మిస్ అయింది. ప్రస్తుతం డిక్టేటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. సంక్రాంతి కానుకగా గ్రాండ్ గావిడుదల కావడానికి సిద్ధమౌతోంది.
First Published:  13 Dec 2015 7:04 PM GMT
Next Story