Telugu Global
Others

సెక్స్‌రాకెట్ టీడీపీ నేతలు! జల్సా చేస్తున్న ఎమ్మెల్యే?

బెజవాడలో వెలుగుచూసిన దుర్మార్గపు వడ్డీవ్యాపారం కాల్ మనీ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కాల్‌ మని వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా చెబుతుండగా… ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రిక ఏకంగా సదరు ప్రజానిధులకు సంబంధించి క్లూ కూడా ఇచ్చింది. వందల కోట్లలో కాల్ మనీ దందా నడుపుతున్న బడాబాబులు డబ్బు వసూలు కోసం […]

సెక్స్‌రాకెట్ టీడీపీ నేతలు! జల్సా చేస్తున్న ఎమ్మెల్యే?
X

బెజవాడలో వెలుగుచూసిన దుర్మార్గపు వడ్డీవ్యాపారం కాల్ మనీ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కాల్‌ మని వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా చెబుతుండగా… ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రిక ఏకంగా సదరు ప్రజానిధులకు సంబంధించి క్లూ కూడా ఇచ్చింది.

వందల కోట్లలో కాల్ మనీ దందా నడుపుతున్న బడాబాబులు డబ్బు వసూలు కోసం మహిళలను వేధిస్తున్నారు. వీరి బారిన వందలాది మంది పడ్డారు. డబ్బు చెల్లించలేని పక్షంలో సదరు కుటుంబానికి చెందిన మహిళలను లైంగికంగా వాడుకోవడం ఈ బ్యాచ్ స్టైల్. అంతేకాదు తమ దందాకు అండగా ఉండే అధికారులు, నాయకుల వద్దకు సదరు మహిళలను బలవంతంగా పంపుతున్నట్టు వెలుగుచూసింది. వీరి బారిన కొందరు విద్యార్థినులు కూడా పడ్డారు. చివరకు ఒక మహిళ ధైర్యం చేసి విజయవాడ సీపీని ఆశ్రయించడంతో డొంక కదిలింది. 12 మందిని అరెస్ట్ చేశారు.

Click to Read: సెక్స్ రాకెట్ – రెండుగా చీలిన టీడీపీ నేతలు!

Click to Read: సత్యంను వదిలిపెట్టని సీబీఐ

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించిన ఎలక్ట్రికల్ ఉద్యోగి ఒకరు ఒక యువతిపై ఇదే తరహాలో అత్యాచారం చేశారని వార్తలొస్తున్నాయి. విజయవాడకు పక్కనే ఉండే నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కాల్ మనీకి అండగా ఉన్నారని ఒక పత్రిక రాసింది. సదరు ఎమ్మెల్యే ప్రస్తుతం కాల్ మనీ డబ్బుతోనే విదేశాల్లో విహరిస్తున్నారని ప్రచురించింది. సదరు ఎమ్మెల్యే వెంట కాల్ మనీ సూత్రధారి కూడా ఉన్నారని సమాచారం. ఈ కాల్ మని బ్యాచ్ ఒకే సామాజికవర్గానికి జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేను గతంలో సన్మానం చేయడం కూడా చర్చనీయాంశమైంది. కాల్ మని దందాలో అరెస్ట్‌ అయిన యలమంచిలి శ్రీరామ్ టీడీపీలో క్రీయాశీలకంగా ఉంటున్నారని చెబుతున్నారు.

Click to Read సెక్స్‌ రాకెట్‌ కీచక పర్వం- సంవత్సరీకం నాడు అత్యాచారాలే!

Click to Read: JC Prabhakar Reddy once again makes sensational comments

First Published:  12 Dec 2015 12:39 AM GMT
Next Story