Telugu Global
Others

షబ్బీర్‌ అలీకి బెదిరింపు కాల్, ఆ నెంబర్ ఎవరిది?

తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీకి బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై ఆయన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే చంపేస్తామంటూ ఫోన్‌లో బెదిరించినట్టు షబ్బీర్ అలీ చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5. 42 నిమిషాలకు ఫోన్ కాల్ వచ్చినట్టు చెబుతున్నారు. ”కేసీఆర్‌ మీద ఎక్కువగా మాట్లాడుతున్నావ్.. చంపేస్తాం” అంటూ అవతలి వారు బూతులు తిట్టారని ఆయన చెబుతున్నారు. 040- 69542335 నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని వెల్లడించారు. షబ్బీర్‌ […]

షబ్బీర్‌ అలీకి బెదిరింపు కాల్, ఆ నెంబర్ ఎవరిది?
X

తెలంగాణ శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీకి బెదిరింపు కాల్ వచ్చింది. దీనిపై ఆయన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే చంపేస్తామంటూ ఫోన్‌లో బెదిరించినట్టు షబ్బీర్ అలీ చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5. 42 నిమిషాలకు ఫోన్ కాల్ వచ్చినట్టు చెబుతున్నారు. ”కేసీఆర్‌ మీద ఎక్కువగా మాట్లాడుతున్నావ్.. చంపేస్తాం” అంటూ అవతలి వారు బూతులు తిట్టారని ఆయన చెబుతున్నారు.

040- 69542335 నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని వెల్లడించారు. షబ్బీర్‌ అలీ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఫోన్ నెంబర్ ఎవరిదన్న దానిపై ఆరా తీస్తున్నారు. షబ్బీర్‌ అలీకి బెదిరింపు కాల్స్ రావడంపై జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎంను ప్రతిపక్షనాయకులు విమరిస్తే చంపేస్తామంటూ బెదిరింపులు రావడం చరిత్రలోనే ఎన్నడూ లేదన్నారు. తక్షణం నిందితులను అరెస్ట్ చేయాలని లేకుంటే … దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

First Published:  11 Dec 2015 6:41 PM GMT
Next Story