Telugu Global
Others

నాడు కులం వేరు చేసింది... నేడు కలుపుతోంది!

ఇది 14ఏళ్ల నాటి మాట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలుగా ఉన్నకేసీఆర్, విజయరామారావు  పోటీ నెలకొంది. అప్పట్లో ఖైరతాబాద్ స్థానం నుంచి పి. జనార్దన్ రెడ్డిపై మొద‌టి సారి గెలిచిన సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావుకు మంత్రి పదవిచ్చిన చంద్రబాబు.  అదే సామాజిక వర్గానికి చెందిన కెసీఆర్‌కు మంత్రిపదవి ఇవ్వలేనని చెప్పేశారు. డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాలని కోరారు. దీంతో ఆగ్రహించిన కేసీఆర్ టీడీపీ రాజీనామా చేశారు. […]

నాడు కులం వేరు చేసింది... నేడు కలుపుతోంది!
X
ఇది 14ఏళ్ల నాటి మాట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలుగా ఉన్నకేసీఆర్, విజయరామారావు పోటీ నెలకొంది. అప్పట్లో ఖైరతాబాద్ స్థానం నుంచి పి. జనార్దన్ రెడ్డిపై మొద‌టి సారి గెలిచిన సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావుకు మంత్రి పదవిచ్చిన చంద్రబాబు. అదే సామాజిక వర్గానికి చెందిన కెసీఆర్‌కు మంత్రిపదవి ఇవ్వలేనని చెప్పేశారు. డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకోవాలని కోరారు. దీంతో ఆగ్రహించిన కేసీఆర్ టీడీపీ రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు.
14ఏళ్లు గడిచిపోయాయి. కానీ నాడు మంత్రిపదవి రాని కేసీఆర్ నేడు తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అటు కేవీఆర్ మాత్రం అదొక్కసారే గెలిచి తర్వాత వరుసగా ఓడిపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాజకీయ ఆకాంక్షలు మారిపోయాయి. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో కేసీఆర్, విజయరామారావులు ఇప్పుడు దగ్గరవుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి విజయరామారావు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్శ్ ను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఒకప్పుడు మంత్రిపదవి రేసులో పోటీదారుగా నిలిచిన విజయరామరావును ఆహ్వానిస్తున్నారు. కేవీఆర్ కూడా ఏక్షణమైనా కారెక్కేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
First Published:  12 Dec 2015 4:15 AM GMT
Next Story