Telugu Global
Cinema & Entertainment

రాజ‌శేఖ‌ర్‌  ఇప్పటికి  క‌ళ్లు తెరిచాడు 

రాజేంద్ర ప్రసాద్‌ దిగిపోయి చాలా కాలమైంది. జగపతి బాబు కూడా రెండేళ్ల కిందటే దిగాడు. ఐతే ఇలా ఓ మెట్టు దిగిరావడం వల్ల వచ్చిన సమస్యేమీ లేదు. ఆ తర్వాత ఎన్నో మెట్లు ఎక్కారు. కానీ రాజశేఖరే దిగేది లేదంటూ మొండి పట్టు పట్టుకుని కూర్చున్నాడు. చేస్తే హీరో వేషాలే చేస్తానని భీష్మించుకున్నాడు. కానీ చివరికి ఆయన హీరోగా నటించిన సినిమాలు విడుదలకు కూడా నోచుకోని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ మధ్యే తత్వం బోధపడి.. ఇక […]

రాజ‌శేఖ‌ర్‌  ఇప్పటికి  క‌ళ్లు తెరిచాడు 
X

రాజేంద్ర ప్రసాద్‌ దిగిపోయి చాలా కాలమైంది. జగపతి బాబు కూడా రెండేళ్ల కిందటే దిగాడు. ఐతే ఇలా ఓ మెట్టు దిగిరావడం వల్ల వచ్చిన సమస్యేమీ లేదు. ఆ తర్వాత ఎన్నో మెట్లు ఎక్కారు. కానీ రాజశేఖరే దిగేది లేదంటూ మొండి పట్టు పట్టుకుని కూర్చున్నాడు. చేస్తే హీరో వేషాలే చేస్తానని భీష్మించుకున్నాడు. కానీ చివరికి ఆయన హీరోగా నటించిన సినిమాలు విడుదలకు కూడా నోచుకోని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ మధ్యే తత్వం బోధపడి.. ఇక క్యారెక్టర్‌, విలన్‌ వేషాల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు.

తాజాగా ఓ ప్రముఖ దర్శకుడు రాజశేఖర్‌కు విలన్‌ రోల్‌ ఆఫర్‌ చేసినట్లు సమాచారం. కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఈ యాంగ్రీ మిడిలేజ్డ్‌ మ్యాన్‌ విలన్‌ పాత్ర చేయడానికి సరే అనేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి రాజశేఖరే స్వయంగా వెల్లడిస్తాడట. అంకుశం, మగాడు లాంటి సినిమాలతో ఒకప్పుడు టాప్‌ హీరోగా వెలుగొందిన రాజశేఖర్‌.. 90ల చివరి వరకు బాగానే బండి నడిపించాడు. కానీ కొత్త శతాబ్దంలో రాను రాను ఆయన హవా తగ్గిపోయింది. రాజశేఖ్‌ చివరి సినిమా ‘గడ్డం గ్యాంగ్‌’ ఎంత దారుణమైన ఫలితం చవిచూసిందంటే.. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా జనాలకు తెలియదు. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నటించన ‘పట్టపగలు’ అయితే విడుదలకే నోచుకోలేదు. ‘అర్జున’తో పాటు మరో సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆపేశారు.

First Published:  10 Dec 2015 7:07 PM GMT
Next Story