Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌మంతుడి రికార్డ్స్ ను  ఎన్టీఆరే  బ్రేక్ చేస్తాడా..!

టెంప‌ర్ చిత్రం స‌క్సెస్  ఖుషి తో  యంగ్ టైగ‌ర్  ఎన్టీఆర్ సుకుమార్  తో ప్రారంభించిన     చిత్రం నాన్నకు ప్రేమ‌తో  చిత్రంగా  నామ‌క‌ర‌ణం చేశారు.  అయితే  ప్ర‌స్తుతం   రిలీజ్ చేసిన ఎన్టీఆర్ లుక్  అభిమానుల్ని  ఫిదా చేస్తుంది.   ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్పుడు..  ఎన్టీఆర్ గ‌డ్డం  స్టైల్   గురించి  చాలా విమ‌ర్శ‌లొచ్చాయి.   ఎన్టీఆర్ లుక్  మాస్ కు  క‌నెక్ట్ అయ్యేలా లేదంటూ   టాక్స్  వినిపించాయి . క‌ట్ చేస్తే తాజాగా  రిలీజ్ చేసిన లుక్   మాత్రం […]

శ్రీ‌మంతుడి రికార్డ్స్ ను  ఎన్టీఆరే  బ్రేక్ చేస్తాడా..!
X

టెంప‌ర్ చిత్రం స‌క్సెస్ ఖుషి తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సుకుమార్ తో ప్రారంభించిన చిత్రం నాన్నకు ప్రేమ‌తో చిత్రంగా నామ‌క‌ర‌ణం చేశారు. అయితే ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన ఎన్టీఆర్ లుక్ అభిమానుల్ని ఫిదా చేస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్పుడు.. ఎన్టీఆర్ గ‌డ్డం స్టైల్ గురించి చాలా విమ‌ర్శ‌లొచ్చాయి. ఎన్టీఆర్ లుక్ మాస్ కు క‌నెక్ట్ అయ్యేలా లేదంటూ టాక్స్ వినిపించాయి . క‌ట్ చేస్తే తాజాగా రిలీజ్ చేసిన లుక్ మాత్రం సినిమా పై అంచ‌నాల్ని పెంచేలా ఉంది. ఎన్టీఆర్ ఫేస్ లో పాజిటివ్ ఎన‌ర్జీ రెట్టింపు గా క‌నిపిస్తుంది. సంక్రాంతి బ‌రిలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే యంగ్ టైగ‌ర్ మాత్రం.. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కాగానే .. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్దం అవుతున్నార‌ట‌. ఈ చిత్రం టైటిల్ జ‌నతా గ్యారేజ్ అని వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. అల్రెడీ శ్రీ‌మంతుడు చిత్రంతో దుమ్ము లేపిన కొర‌టాల శివ .. యంగ్ టైగ‌ర్ తో చేయ‌బోయో చిత్రం ఎలా వుంటుందో అనే ఆస‌క్తి ఫ్యాన్స్ లో నెల‌కొంది. క‌రెక్ట్ గా స్టో్రి ప‌డితే.. శ్రీ‌మంతుడి చిత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ ను జ‌న‌తా గ్యారేజ్ బ్రేక్ చేసిన ఆశ్చ‌ర్యం లేదు మ‌రి..! అయితే మ‌హేష్ బాబు రేంజ్ స్టార్ డ‌మ్ ను ఓవ‌ర్ టేక్ చేయ‌డం అంత ఈజి కాదంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్.

Next Story